టీడీపీ, జనసేన.. ఇలా సెల్ఫ్ గోల్ చేసుకున్నాయేంటబ్బా.?

TDP & Jana Sena

TDP & Jana Sena

ఓ మహిళ, జనసేన అధినేతను కలిసి వైఎస్ జగన్ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందనీ, తనకు అండగా నిలవాలని కోరిన మాట వాస్తవం. జనసేన పార్టీకి చెందిన కింది స్థాయి నాయకత్వం వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోకుండా, ఆమెను తమ అధినేత దగ్గరకు తీసుకెళ్ళడం ఆశ్చర్యకరమైన విషయమిక్కడ.

ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో వున్న ఓ కాలనీలో అక్రమ కట్టడాల్ని గుర్తించిన అధికారులు, వారందరినీ అక్కడినుంచి ఖాళీ చేయించి, వారికి వేరే చోట్ల ప్లాట్లను కేటాయించడంతోపాటు, ఇళ్ళను నిర్మించేందుకు హామీ ఇచ్చారు. కొంత నష్టపరిహారం కూడా విడుదల చేశారు. వారిలో ఓ కుటుంబానికి ఏకంగా రెండు ఇళ్ళ స్థాలు ప్రభుత్వం నుంచి లభించాయి.

ఆ విషయాన్ని జనసేనగానీ, తెలుగుదేశం పార్టీగానీ గుర్తించలేకపోయాయి. అధికారులు, ఇళ్ళను ఖాళీ చేయించే క్రమంలో బాధిత మహిళగా చెప్పబడుతున్న శివశ్రీ గతంలో వాలంటీర్‌గా పని చేయడం గమనార్హం.

ఇక, ఈ వ్యవహారంపై పెద్దయెత్తున యాగీ జరిగింది. చివరికి అధికారులు వాస్తవాల్ని వెల్లడించేరికి అటు టీడీపీ, ఇటు జనసేన సైలెంటయిపోవాల్సి వచ్చింది. కాగా, అధికారులు.. శివశ్రీ కుటుంబానికి పునరావాసం కల్పించకపోవడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఆమెకు నివాసముండేందుకు సరైన ఇల్లు దొరికే వరకు ఆమెకు అండగా వుంటామంటూ, ఆమెకు ఆశ్రయం కల్పించిన స్థానిక జనసేన నేతలకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుని, ప్లాట్లు కూడా తీసుకుని, ఇల్లు ఖాళీ చెయ్యకుండా డ్రామాకి తెరలేపిన శివశ్రీ, రెండు రాజకీయ పార్టీల్ని ఒకేసారి బోల్తా కొట్టించారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీకే పొలిటికల్ అడ్వాంటేజ్ లభించిందని చెప్పొచ్చు.