NTR: అభిమానులకు సంక్రాంతి సర్ప్రైజ్ ఇవ్వనున్న తారక్..?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2018 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో బిజీగా ఉండటం వల్ల మరే సినిమాకి డేట్స్ ఇవ్వలేదు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే రెండు మూడు సంవత్సరాలు అతని బందీఖానాలో ఉండాల్సిందే. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు కొన్ని నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు తన కొత్త సినిమాల గురించి ఏమాత్రం ప్రస్తావించడం లేదు.

ఈ సినిమాలో తారక్ తో పాటు నటించిన రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తూనే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అదే విధంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమాని కూడా లైన్లో పెడుతున్నారు.కానీ తారక్ మాత్రం ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు ఎన్టీఆర్ గ్రహించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వబోతున్నారనే సమాచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తారక్ అభిమానులు సైతం ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారు అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బహుశా కొరటాల శివ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.