ఊపిరి పీల్చుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఆ షో రెగ్యులర్ గా కాదట?

బుల్లితెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తునప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ స్టార్స్ వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రసారం కాగా గత కొద్ది రోజుల నుంచి పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమం విపరీతంగా ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చారు.అయితే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ ఎఫెక్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం పై భారీగా పడింది.

ఈ కార్యక్రమం ద్వారా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం భారీ ప్రమాదంలో పడిందని నిర్వాహకులు భావిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఊరట లభించింది. స్టార్ మాలో ప్రసారమవుతున్న పార్టీ చేద్దాం పుష్ప కార్యక్రమం ప్రతివారం ప్రసారం కాదని తెలియడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమం ప్రతివారం ప్రసారం కాదని కేవలం సింగిల్ ఎపిసోడ్ మాత్రమేనని నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. మరి ఈ కార్యక్రమం స్థానంలో మరేదైనా కొత్త కార్యక్రమం వస్తుందేమో తెలియాల్సి ఉంది.

ఈ కార్యక్రమం రెగ్యులర్ గా కాకుండా ఏదైనా ప్రత్యేక ఈవెంట్ సమయంలో ఇలా పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని స్టార్ మా క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం రెండు కూడా ఆదివారం మాత్రమే ప్రసారమవుతాయి కనుక ఈ కార్యక్రమం కనుక క్లిక్ అయితే శ్రీదేవి కార్యక్రమానికి భారీ నష్టం ఉంటుందని భావించారు. ఈ కార్యక్రమం రెగ్యులర్ గా ప్రసారం కాదని తెలియడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి ఎలాంటి ప్రమాదం లేదని ఎప్పటిలాగే ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్ సంపాదించుకొని దూసుకుపోతుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.