Winter Skin Care: చలికాలంలో స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా… ఈ సమస్యలు తప్పవు!

Winter Skin Care: సాధారణంగా శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలంలో శరీరారోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యమైనంతవరకు చర్మాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఉన్నితో తయారు చేసిన వస్త్రాలను ధరించాలి.చలికాలంలో స్వేటర్ ధరించడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచవచ్చు . స్వెట్టర్ ధరించడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

శీతాకాలంలో చాలామందికి రాత్రివేళ అధిగమించడానికి వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది. స్వెటర్ వేసుకోవటం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేయవచ్చు. కానీ రాత్రివేళ స్వెటర్ వేసుకుని నిద్ర పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.స్వెటర్ ధరించటం వల్ల రాత్రివేళ శరీరం నుండి ఎక్కువ వేడి వెలువడుతుంది దాని ఫలితంగా శరీరం మీద అలర్జీ వల్ల దద్దుర్లు ఏర్పడతాయి.

సాధారణంగా శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తారు.ఉన్ని దుస్తులు మీద స్వెటర్ ధరించి నిద్రపోవటం వల్ల చెమటలు పట్టి బీపీ సమస్యలు మొదలవుతాయి. అంతే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.

స్వెట్టర్ మాత్రమే కాకుండా సాక్స్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవటం కూడా మానేయాలి. సాక్స్,గ్లోజ్ వేసుకొని నిద్రించడం వల్ల కాళ్లు, చేతులు చెమటలు పట్టి చెమట వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. స్వెట్టర్ ధరించి నిద్రపోవటం వల్ల ఆస్మా వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.