డిజే టిల్లుకి షాక్ ఇచ్చిన శ్రీ లీల.. రెండు రోజులకే సినిమాకి గుడ్ బై!

పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు నటి శ్రీ లీల.ఇలా పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దాదాపు అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకుని బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీలాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈ సీక్వెల్ చిత్రంలో హీరోయిన్ నేహా శెట్టికి బదులు నటి శ్రీ లీలాను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న శ్రీ లీలా రెండు రోజులు కూడా కాకుండానే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఇలా ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి సరైన కారణాలు తెలియకపోయినా ఈమె ప్రస్తుతం ఈ సినిమాకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.ఇలా సినిమా నుంచి శ్రీ లీలా తప్పుకోవడంతో మేకర్స్ చేసేదేమీ లేక ఈ సినిమాలో మరొక హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు.అయితే ఈమె పలు సినిమాలతో బిజీగా ఉండటంవల్లే ఈ సినిమాలో నటించడం కుదరలేదా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.