కోవిడ్ 19: ప్రైవేటు వద్దు.. ప్రభుత్వాసుపత్రే ముద్దు.!

Say No To Private Hospital, Govt Hospitals Are Best

Say No To Private Hospital, Govt Hospitals Are Best

ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితో అప్పులపాలైపోవడం తప్ప, కరోనా బాధితులు కోలుకోవడం కష్టమేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి, గతంలో సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రుల గురించి ఈ మాట వినిపించేది. ‘ప్రభుత్వాసుపత్రికి వెళుతున్నారా.? ప్రాణాల మీద ఆశ లేదా.?’ అనే వెటకారపు ప్రశ్న వస్తుండేది. కానీ, లక్షలాదిమంది, కోట్లాదిమందికి ప్రభుత్వాసుపత్రులే దిక్కు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేతులెత్తేశాక, చివరి క్షణాల్లో ప్రభుత్వాసుపత్రులకు రోగుల్ని తరలించడం తరచుగా చూస్తూనే వుంటాం. సరే, కోవిడ్ విషయానికి వద్దాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినాగానీ, ప్రభుత్వాసుపత్రులపై అపనమ్మకమో.. మరో కారణమోగానీ, ప్రైవేటు ఆసుపత్రులకు కొందరు మొగ్గు చూపడం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మాత్రం, ‘ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి ఆర్థికంగా నష్టపోకండి.. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలున్నాయి.. ఖర్చుతో పని లేకుండా కోలుకోవచ్చు..’ అని అంటోంది. మొదటి వేవ్ సందర్భంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ఇదే తరహా పిలుపునిచ్చారు. ఇప్పుడూ ఆయన వాదనల్లో మార్పు రాలేదు.

అయితే, కేసీఆర్ ఎందుకు కరోనా సోకగానే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళారు.? అన్నప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. నిజమే, ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యుల్ని ఫామ్ హౌస్ వద్దకు రప్పించుకుని వైద్య చికిత్స చేయించుకుని.. అవసరమైతే, ప్రభుత్వాసుపత్రిలోనే వైద్య పరీక్షలూ కేసీఆర్ చేయించుకుని వుండాల్సింది. తద్వారా ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. అయితే, ప్రోటోకాల్ ప్రకారం.. సీఎం ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వర్గాలు చూస్తాయి గనుక.. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత ఆరోగ్యాన్నిపరిరక్షిస్తారు గనుక.. కేసీఆర్, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళడాన్ని తప్పు పట్టలేం.. అనే వాదనా లేకపోలేదు.