ప్రస్తుతం ఏపీ టీడీపీలో లోకేష్ పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రం మొత్తం సందడి లేకపోయినా.. పాదయాత్ర జరుగుతున్న నియోజకవర్గ పరిధిలో మాత్రం ఆ హడావిడి కనిపిస్తోంది. ఈ పాదయాత్రలో అధికార వైసీపీపై లోకేష్ వేస్తున్న సెటైర్లు, చేస్తున్న కామెంట్లు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. అయితే… లోకేష్ సెటైర్స్ కి కాస్త బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది!
అవును… ఏపీలో ప్రస్తుతం రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చి, అటు జగన్ పైనా, ఇటు ఏపీ మంత్రులపైనా ఎవరూ ఊహించని స్థాయిలో సెటైర్లు వేస్తున్న లోకేష్ పాదయాత్రకు బ్రేక్ వేయాలని కోరుతుంది వైసీపీ. అందుకు వారు ఎంచుకున్న మార్గం.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. ఇప్పటికే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కి, చిత్తురు జిల్లా అధికార యంత్రాంగం లేక కూడా రాసింది!
దీంతో.. ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఈసీ కనుక యువగళం పాదయాత్రకు బ్రేక్ వేసిందంటే మాత్రం… వైకాపాకి కాగల కార్యం ఈసీ తీర్చినట్లుగా అవుతుంది! ఎందుకంటే… పైకి చెప్పకపోయినా లోకేష్ పాదయాత్రను వైసీపీ నాయకులు లైట్ తీసుకోవడం లేదు. ఇందుకు లోకేష్ ఎంచుకున్న స్ట్రాటజీ కూడా ఒక కారణం. ఎందుకంటే… లోకేష్ మైకందుకుకోవడం ఆలస్యం.. నేరుగా జగన్ పైనా.. వైకాపాలో మాస్ లీడర్లపైనా నోరేసుకుని పడిపోతున్నారు!
దీంతో… మరో ఆప్షన్ లేని ఏపీ మంత్రులు – ఎమ్మెల్యేలు.. ప్రెస్ మీట్ లు పెట్టి, గంటల తరబడి లోకేష్ కామెంట్లకు స్పందిస్తున్నారు. ఫలితంగా.. ప్రతీరోజూ మీడియాలో లోకేష్ పాదయాత్ర సజీవంగా ఉంటుంది! ఈ పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ రూపంలో ఆ యువగళానికి బ్రేక్ పడితే… వైకాపా కాస్త రిలాక్స్ అయ్యి, ఆల్టర్ నేటివ్స్ ఆలోచించుకోవచ్చన్నమాటే!