కరోనా ప్రభావం అన్నిరంగాలకంటే విద్యారంగంపై మరింత అధికంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ ఏడాది విద్యా సంవత్సరం పూర్తిగా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. పాఠశాలల్ని ఏడాదిలో కనీసం 9 మాసాల పాటు నిర్వహించారు. అలాగే తక్కువలో తక్కువగా 200 రోజుల పనిదినాలు ఉండాలి. లేనిపక్షంలో నిర్దేశిత సిలబస్ పూర్తికాదు. అది పూర్తికాకుండా విద్యార్థులు తరగతికెళ్ళేందుకు తగినంత విజ్ఞానాన్ని సంపాదించ లేడు. ప్రతి ఏటా భారత దేశంలో జూన్ మధ్యలో తరగతులు ప్రారంభమౌతాయి. కానీ ఈసారి డిసెంబర్ కు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో? అంతుబట్టడం లేదు. ఆ తర్వాత విద్యాసంస్థల్ని తెరిచినప్పటికీ తిరిగి ఏప్రిల్ లేదా మే మాసాల్లో గురయ్యే ప్రమాదముంది.
ఈ రీత్యా ఆలోచించినా విద్యా సంవత్సరాన్ని రద్దు చేసుకోవడమొకటే మేలైన ప్రక్రియగా నిపుణులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థుల్ని బడికి పంపిస్తే తల్లికి ఏటా 15 వేల రూపాయలు అమ్మఒడి పథకంలో చెల్లిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్, బిసి, ఒబిసిలకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. మరి విద్యాసంస్థకు హాజరు కాకుండా ప్రభుత్వం విద్యార్థులకు వీటన్నింటిని చెల్లించడం నిబంధనల మేరకు సరికాదు. దీంతో ఈ ఏడాది ఈ పథకాలన్నింటిని తాత్కాలికంగా నిలిపేయాలన్న ప్రతిపాదనలు సాగుతున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు.
విద్యా సంవత్సరాన్ని నిలిపేస్తే వీరందరికీ ప్రత్యామ్నాయంగా ఏ విధమైన పనిని కేటాయించాలన్న దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. వీరికి ప్రభుత్వం వేల కోట్లరూపాయల్ని జీతభత్యాలుగా చెల్లిస్తున్నాయి. పని చేయించుకోకుండా వీరికి జీతాలివ్వడం సరికాదు. కరోనా ప్రభావం అన్నిరంగాల్ని దెబ్బతీసింది. ఎప్పుడు తిరిగి కోలుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికంటే కూడా విద్యావ్యవస్థపై ఇది తీవ్రంగా ఉంది. కాబట్టి పరిస్థితులు అన్ని పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ఉపాధ్యాయులకు జీతాలు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు. అలాకానీ పక్షంలో ఉన్న సిబ్బందితో ప్రభుత్వానికి చెందిన ఇతర పనులు చేయించే దిశగా ఆలోచన చేయాలని, అంతేగానీ ఊరుకునే కూర్చోబెట్టి జీతాలు చెల్లించడం ఏమాత్రం తగ్గదని వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.