రైల్వే శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. 6180 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 6180 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ నెల 28వ తేదీన జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. దేశంలోని అన్ని ఆర్.ఆర్.బీ రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం.

టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగ ఖాళీలు 180 ఉండగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగ ఖాళీలు 6000 ఉన్నాయి. అర్హత, వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు వివరాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఖాళీలు, విద్యార్హత, సిలబస్, రాత పరీక్ష పూర్తీ వివరాలు త్వరలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. పదో తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు గ్రేడ్ 1 ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు గ్రేడ్ 3 ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. గ్రేడ్1 ఉద్యోగాలకు బీఎస్సీ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉన్నవారు అర్హత కలిగి ఉంటారు.

గ్రేడ్3 ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉన్నవారు పదో తరగతితో పాటు ఐటీఐ అర్హత కలిగి ఉండాలని చెప్పవచ్చు. rrbapply.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు 19,900 రూపాయల నుంచి 29,200 రూపాయల వరకు వేతనం లభిస్తుందని చెప్పవచ్చు.