RRR : పరిస్థితులు అన్నీ గనుక బాగుండి ఉంటే ఈ పాటికి ఇండియా సినిమా దగ్గర నాన్ బాహుబలి రికార్డ్స్ అనే మాట పోయి నాన్ ట్రిపుల్ ఆర్(RRR) అనే మాట స్థిరపడిపోయి ఉండేదని చెప్పాలి. అసలు ఎవరూ ఊహించని విధంగా కరోనా వచ్చి అన్ని సినిమాల పరిస్థితులు తలకిందులు అయ్యిపోయాయి. అయితే పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ట్రిపుల్ ఆర్ మళ్లీ రిలీజ్ కి సిద్ధం కాగా మళ్లీ అంచనాలు పెరిగుతూ వెళ్తున్నాయి.
అయితే నిజానికి ఈ చిత్రం అంచనాలు డిసెంబర్ 31 కి ముందు అలా భారీ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో రికార్డు స్థాయి బుకింగ్స్ తో సంచలనమే రేపింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ ఓవర్సీస్ లో రిలీస్ కి రెడీ అవుతుండగా ఇంకో క్రేజీ బిగ్ బజ్ ఈ సినిమాపై వినిపిస్తోంది. ఈ సినిమా ని ఈసారి మరిన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యబోతున్నారట. అంతేకాకుండా లాస్ట్ టైం యాడ్ చెయ్యని మరిన్ని పేరు మోసిన ప్రముఖ బిగ్ స్క్రీన్స్ ని ఈసారి ట్రిపుల్ ఆర్ కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
వీటిలో కొన్ని కేవలం హాలీవుడ్ సినిమాలు మాత్రమే వేసేవి కూడా ఉన్నాయట. దీనితో ఈ సినిమాకి ఓవర్సీస్ లో మరింత స్థాయి భారీ రిలీజ్ దక్కబోతున్నట్టు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. మరి అక్కడ ఈ సినిమాకి ఏ రేంజ్ వసూళ్లు దక్కుతాయో చూడాలి. ఇక ఈ భారీ సినిమా లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాని భారీ స్కేల్ లో తెరకెక్కించారు.