RRR : ‘ఆర్ఆర్ఆర్’.. ఆ ఖర్చు తడిసి మోపెడైందా.?

RRR : డౌటేముంది.? ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆ చిత్ర నిర్మాతకి గుదిబండే. అనుకున్న సమయానికి సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ఎంత తపన పడాలో, ఒకవేళ సినిమా రిలీజ్ వాయిదా పడిదే, అంతకు పది రెట్లు.. వంద రెట్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏ నిర్మాతకైనా.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. కనీ వినీ ఎరుగని రీతిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రచారం చేసేశారు.. సంక్రాంతి విడుదల ముహూర్తం పెట్టుకున్న కారణంగా. అయితే, కరోనా మూడో వేవ్ అలాగే ఏపీలో సినిమా థియేటర్ల సమస్య.. వెరసి, ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది.

మార్చి 25న విడుదలవుతుందంటూ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ, మరో దఫా ప్రచార కార్యక్రమాలు ఎప్పుడు.? ఎలా మొదలు పెడతారు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చెన్నయ్, ముంబై, బెంగళూరు, హైద్రాబాద్.. ఇలా ప్రధాన నగరాల్లో సినిమా కోసం ప్రచారం చేయాలంటే, దానికి మళ్ళీ బోల్డంత ఖర్చు తప్పదు. కానీ, ఖర్చు చేసి తీరాల్సిందే.

రాజమౌళి కేవలం దర్శకుడే కాదు, సినిమా ప్రమోషన్స్‌ని కూడా డిజైన్ చేస్తుంటాడు. ఎలా సినిమాని పబ్లిసిటీ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. కానీ, ఆ రాజమౌళి కూడా ఇప్పుడు అయోమయంలో పడిపోయాడు. ఈ గందరగోళం నడుమ, ‘ఆర్ఆర్ఆర్’ ఎలా ప్రచార కార్యక్రమాల్ని డిజైన్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.