Sukumar: ఫాదర్స్ డే స్పెషల్… పిల్లలు ఇచ్చిన కానుక చూసి కన్నీళ్లు పెట్టుకున్న  సుకుమార్!

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆర్య సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్నారు. అల్లు అర్జున్ తో కలిసి ఈయన చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో  ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక పుష్ప సినిమా మంచి విజయం కావడంతో సుకుమార్ పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ద్వారా సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల సుకుమార్ తన పెళ్లి రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. తన 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈయన భార్య తబిత సోషల్ మీడియా వేదికగా వీరి పెళ్లిరోజుకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

పెళ్లిరోజు కావడంతో వీరంతా వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది  ఇలా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన పిల్లలు ఈ వెకేషన్ లోనే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. సుకుమార్ పిల్లలిద్దరూ అద్భుతమైన పెయింటింగ్ వేసినట్టు తెలుస్తోంది. ఇలా తన తల్లిదండ్రులతో పాటు వారి ఫోటోలను కూడా పెయింటింగ్ వేసి తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు . ఇలా తన పిల్లలు అద్భుతమైన పెయింటింగ్ చూసిన సుకుమారు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సుకుమార్ కుమార్తె  సుకృత ఇటీవల గాంధీ తాత చెట్టు అనే సినిమాలో అద్భుతంగా నటించింది.ఈ సినిమాతో ఉత్తమ బాలనటిగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాలను కూడ అందుకన్నారు.