కొత్త కారు ముందు ర‌ష్మిక ఫోజులు.. మీతో పంచుకోవాల‌నిపించింది అంటూ ట్వీట్

ఛ‌లో, గీతా గోవిందం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన బెంగ‌ళూరు బ్యూటీ ర‌ష్మిక మందాన. ప్ర‌స్తుతం ఈ అమ్మడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఫుల్ బిజీగా ఉంది. వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డంతో ఈ అమ్మ‌డు త‌న రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేసింది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ర‌ష్మిక డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప‌లు హిందీ సినిమాల‌తో పాటు తెలుగులో పుష్ప‌, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సిని‌మా చేస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంతోష‌క‌ర‌మైన విష‌యాన్ని పంచుకుంది.

ర‌ష్మిక త‌న అభిరుచికి అనుగుణంగా కార్ల‌ని కొంటూ ఉంటుంది. కొన్ని త‌ర్వాత వాటిని మార్చి వేరే కార్స్ తీసుకుంటుంది. ఈ సారి త‌నకెంతో ఇష్ట‌మైన రేంజ్ రోవ‌ర్ ఎస్ యూవీని కొనుగోలు చేసింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. నేను సాధార‌ణంగా ఇలాంటివి కొనుగోలు చేస్తూ ఉంటాను. కాని ఈ సారి మీతో ఈ విష‌యాన్ని పంచుకోవాల‌ని అనిపించింది. నా జర్నీలో మీరు కూడా భాగ‌మ‌య్యారు. అందుకే మీతో ఈ విష‌యం తెలియ‌జేస్తున్నా అని ర‌ష్మిక పేర్కొంది.

ఇక ఈ కారు మీ కోస‌మే.. గ్రేట్ ఫుల్ అంటూ రేంజ్ రోవ‌ర్ ముందు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో దిగిన ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక హ‌వా బాగానే న‌డుస్తుంది. గ‌త ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ వంటి చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ అమ్మ‌డు 2021లో ర‌చ్చ చేసేందుకు సిద్ద‌మైంది.