ఓటీటీలను తలుచుకుని భయపడుతున్న తెలుగు సినిమాలు

Producers unhappy with OTT's

Producers unhappy with OTT's

ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఓటీటీ సంస్థలు లాక్ డౌన్ సమయంలో మాత్రం హవా చూపించాయి. థియేటర్లలో రాలేని సినిమాలను పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేసి రిలీజ్ చేసి జనంలోకి చొచ్చుకునిపోయాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ లాంటివన్నీ భారీగా ఎదిగాయి. వాటి దెబ్బకు ప్రేక్షకులు మళ్ళీ సినిమా హాళ్ల వైపుకు చూస్తారా అనే అనుమానం మొదలైంది. కానీ అనూహ్యంగా థియేటర్లు తెరుచుకోవడమే ఆలస్యం ప్రేక్షకులు పరుగులుపెట్టారు. దాంతో థియేట్రికల్ హక్కులు కొనే డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాళ్లలో విడుదలైన రెండు నెలల తర్వాతనే సినిమాను ఓటీటీల్లోకి వదలాలని కండిషన్ పెట్టారు.

నిర్మాతలు కూడ అదే చేస్తున్నారు. దీంతో ఓటీటీలకు చురక తప్పలేదు. నిర్మాతల వైఖరితో అవి కాస్త నొచ్చుకున్నాయి. కానీ మరోసారి ఓటీటీలకు టైమ్ వచ్చింది. సెకండ్ వేవ్ దెబ్బకు సినిమా హక్కు మూతబడుతున్నాయి. ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీ అంటున్నారు. త్వరలో పూర్తిగా క్లోజ్ అయ్యేలా ఉన్నాయి. దీంతో నిర్మాతలు మరోసారి ఓటీటీల వైఫుకు చూస్తున్నారు. అయితే ఓటీటీలు మాత్రం మునుపటిలా నిర్మాతలు ఎంత చెబితే అంత ఇచ్చి సినిమాలు తీసుకునేలా లేవు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలను అప్రోచ్ అవ్వగా నిర్మాణ ఖర్చుల వరకు మాత్రమే ఇస్తామని అంటున్నారట. కొన్ని సినిమాలకైతే అవి కూడ పూర్తిగా ఇవ్వమని ఇష్టం ఉంటే ఇవ్వండని లేకుంటే మానుకోండని అంటున్నారట.