పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ నిర్మిస్తున్న భూమి ఖరీదు తెలిస్తే షాక్.?

సాధారణంగా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు కోట్ల రూపాయలు విలువ చేసే విలాసవంతమైన ఇళ్ళల్లో నివసిస్తూ ఉంటారు. అంతే కాకుండా ప్రత్యేక సందర్భాలలో కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవటానికి ఖరీదైన ఫామ్ హౌస్ లు కూడా నిర్మించుకుంటున్నారు. టాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఫామ్ హౌస్ నిర్మించుకుంటున్నాడు. తాజాగా మరొక టాలివుడ్ స్టార్ హీరో కూడా ఫామ్ హౌస్ ని
నిర్మించుకుంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ఖాళీ సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ వ్యవసాయం చేయటానికి ఆసక్తి చూపుతారు.

అందుకే ఖాళీ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన ఫామ్ హౌస్ లో సమయాన్ని గడుపుతుంటారు. చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నగర శివారులో గల గండిపేట, చిలుకూరు మధ్య విస్తరించిన ఉన్న 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఇదివరకే ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నిర్మించుకొని సినిమాలు రాజకీయాలకు సంబంధించిన కార్యకలాపాలను ఇక్కడి నుండి నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ చిన్నదిగా ఉండటంతో పవన్ కళ్యాణ్ దానిని కూల్చివేసి ఆత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఫామ్ హౌస్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడటంతో రోజు ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఎన్నో ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ఈ భూమి ధర ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నిర్మించిన ప్రదేశంలో ఒక ఎకరం భూమి ఖరీదు దాదాపు పది కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నిర్మిస్తున్న 16 ఎకరాల ప్రదేశం 160 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అంత ఖరీదైన ప్రదేశంలో పవన్ కళ్యాణ్ అత్యాధునిక సౌకర్యాలతో, కొత్త హంగులతో ఫార్మ్ హౌస్ ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. హర హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల సమయం దగ్గర పడటంతో ఆయన అంగీకరించిన సినిమాలను తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.