బిగ్ బజ్ : ఈ వేదికపై ఐకాన్ స్టార్ కోసం పాన్ ఇండియన్ స్టార్..?

Pan Indian Star Coming For Icon Star In This Stage | Telugu Rajyam

ఇక ఈ డిసెంబర్ నెల స్టార్ట్ అవుతుండడంతోనే మళ్ళీ టాలీవుడ్ లో సరికొత్త ఊపు మొదలు అవుతుందని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. బాలయ్య అఖండ నుంచి మొదలు కానున్న ఈ మేనియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప దగ్గరకి వచ్చేసరికి మరో స్థాయికి వెళ్లనుంది.

అయితే “పుష్ప” సినిమాని భారీ లెవెల్లోనే ప్లాన్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో ప్రెజెంట్ చెయ్యాలని మేకర్స్ పూనుకున్నారు. మరి అందుకోసమే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే పుష్ప ఫంక్షన్ కోసం ప్రభాస్ ని పిలుస్తున్నారని బజ్ ఉంది కానీ అది హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమా లేక తెలుగు ఈవెంట్ లో ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ కానీ ఇదే నిజం అయితే ఐకాన్ స్టార్ కి పాన్ ఇండియన్ స్టార్ హైప్ బాగా వర్క్ అవుతుందని చెప్పాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles