Omicran: ఇంట్లోనే పరీక్ష ద్వారా ఒమిక్రాన్ వైరస్ ను గుర్తించవచ్చా?

Delta Plus will lead to a third wave in india

Omicran: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఒమిక్రాన్ ని గుర్తించే పరీక్షలు వేగవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది.సాధారణంగా RT-PCR (రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్-పాలిమరేస్ చైన్ రియాక్షన్) పరీక్ష ద్వారా covid -19 ఇన్ఫెక్షన్ గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరీక్ష చేసిన తర్వాత ఫలితం ఖచ్చితంగా వస్తుంది.. కాకపోతే ఫలితాలు రావడానికి రెండు , మూడు రోజుల సమయం పడుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు రిజల్ట్ వచ్చేదాకా వేచి చూడడం వల్ల సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చాలామంది తక్కువ సమయంలో రిజల్ట్స్ వచ్చే కరోనా పరీక్షలపై ఆధారపడుతుంటారు. అటువంటివాటిలో ముఖ్యమైనది యాంటిజెన్ పరీక్ష.

ప్రస్తుత కాలంలో చాలా మంది జలుబు దగ్గు వంటి సాధారణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ అవి కరోనా లక్షణాలు ఏమో అని భయపడుతుంటారు. అటువంటి సమయంలో ఇంట్లోనే సులభమైన పద్ధతిలో యాంటిజెన్ పరీక్ష ద్వారా కోవిడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల అతి తక్కువ సమయంలోనే రిజల్ట్ తెలుస్తుంది. కోవిడ్ అని నిర్ధారణ అయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవటంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ యాంటిజెన్ పరీక్ష చేయటం వల్ల 5 నుండి 30 నిమిషాల లోపు రిజల్ట్ తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం యాంటిజెన్ పరీక్ష ద్వారా ఓమిక్రాన్ ని గుర్తించగలమా , లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు సమాధానంగా ఈ వ్యాధి నిపుణులు ” కాలేజ్ ఆఫ్ అమెరికన్ పాథాలజిస్ట్స్ ప్రెసిడెంట్ ఎమిలీ వోల్క్ ప్రకారం.. ఇలాంటి టెస్ట్‌లు కొవిడ్‌ 19ని నిర్దారించగలవు. కానీ అది డెల్టా, ఆల్ఫా లేదా ఓమిక్రాన్ వేరియంట్‌ అనేది గుర్తించడం కొంచెం కష్టమని చెప్పారు. అంతేకాదు ఇతర రకాల వైరస్‌ల కంటే ఒమీ క్రాన్ గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పారు.

అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఆంథోనీ ఫౌసీ ప్రకారం ఇంట్లో టెస్ట్‌ల ద్వారా ఓమిక్రాన్‌ను గుర్తించడం కొంచెం కష్టమే అని చెప్పారు.యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌లను గుర్తించడానికి అనేక కొత్తరకాల టెస్ట్‌లు వచ్చాయని కాకపోతే ఈ పరీక్షల వల్ల ఒమిక్రాన్ గుర్తించటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. అందువల్ల ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.