కన్ఫర్మ్ : ఎన్టీఆర్ – కొరటాల భారీ సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోయింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన కుటుంబంతో కలిసి ఓ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రెజెంట్ హోస్ట్ గా చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” నుంచి బ్రేక్ తీసుకొని తారక్ ఈ వెకేషన్ లో ఉన్నాడు. ఇక ఇది అయ్యాక తన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ప్రమోషన్స్ లో కూడా పాల్గొననున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇపుడు ఈ సినిమాపైనే లేటెస్ట్ సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో కొరటాల ఒక ఇంట్రెస్టింగ్ రివెంజ్ డ్రామాగా ప్లాన్ చేసాడట.

అందుకు తగ్గట్టుగానే భారీ లెవెల్ విజువల్స్ యాక్షన్ తోనే ఈ సినిమా కనిపించనున్నట్టు ప్రెజెంట్ సమాచారం. అలాగే బడ్జెట్ కూడా 200 కోట్లు మేర ఉండొచ్చనే బజ్ కూడా వినిపిస్తుంది. అలానే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అయితే ఇదే అని కన్ఫర్మ్ అయ్యింది.