Rahul Sipligunj: ముంబైలో ఆటో నడుపుతున్న రాహుల్ సింప్లిగంజ్.. వైరల్ అవుతున్న వీడియో

Rahul Sipligunj: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి సింగర్ రాహుల్ సింప్లిగంజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సింగర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ గల్లీ పోరడు. అంతేకాకుండా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనడటమే కాకుండా టైటిల్ విన్నర్ అయ్యి వచ్చిండు. ఆ తర్వాత ఇంకా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు రాహుల్ సింప్లిగంజ్.

బిగ్ బాస్ 3 సీజన్ విజేతగా నిలిచి ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఈ మధ్య కాలంలో రాహుల్ ఎక్కువగా సామజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అభినులతో టచ్ లో ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయాన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకి పంచుకుంటున్నాడు కూడా. అంతే కాకుండా రాహుల్ ఈ చిన్న పోస్ట్ పెట్టినా సామాజిక మాధ్యమాల్లో ఇట్టే వైరల్ అయ్యి ట్రేండింగ్ లో నిలుస్తాయి.


ఇదిలా ఉంటే తాజాగా అర్ధరాత్రి ముంబై నగర వీధుల్లో ఆటో నడుపుతూ కనిపించాడు రాహుల్ సింప్లిగంజ్. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే మహా నగరం ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ సింప్లిగంజ్ ముంబై నగరానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ నుండి విడుదలైన ‘నాటు నాటు’ పాటని రాహుల్ పాడాడు. ఈవెంట్ కి వెళ్ళిన రాహుల్ ఇలా తన సరదాని కూడా తీర్చుకోగా అది కాస్తా గత రెండు రోజుల నుండి వైరల్ అవుతుంది.