Rajamouli : ‘RRR’ ఆ కాంట్రవర్సీ పై రాజమౌళి సంచలన రిప్లై.!

Rajamouli : బేసిక్ గా ఒక చారిత్రిక లేదా ఇతిహాస సినిమా తీసేటప్పుడు పలు కాంట్రవర్సీ లు ఇబ్బందులు తప్పని సరి. అది ఏ సినిమాకి అయినా తప్పవు మరి లేటెస్ట్ గా పాన్ ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కి కూడా తప్పలేదు.

ఇద్దరు మాస్ హీరోలతో ఇండియా టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇద్దరు తెలుగు నేలకి చెందిన స్వతంత్ర సమర యోధులు కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలపై తీసారు. మరి ఇద్దరితో రాజమౌళి నాటు నాటు అంటూ మాస్ సాంగ్ చూపించడం ఏమిటి?

ఆ స్టెప్పులు ఏమిటి ఇలాంటి ఘటన ఎలా పెడతారు? అని పలు కాంట్రవర్సీ లు ఆ సంచలనం రేపాయి మరి వాటికి రాజమౌళి కూడా అంతే రీతి సమాధానం ఇచ్చారు. అసలు నేను చూపించింది చిన్న బిట్ అని సాంగ్ మొత్తంలో ఇంకా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి.

అవి ఇంకా అందరికీ తెలియవు కదా? అసలు ఎందుకు ఆ సందర్భం వచ్చిందో సినిమా చూస్తే అర్ధం అవుతుంది అని అప్పుడు వాళ్ళు అందరికీ సమాధానం దొరుకుతుంది అని రాజమౌళి హుందాగా తన సమాధానం లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఇచ్చారు.