RRR Promotions : ఏంటిది ఎన్టీయారూ.! ఎంత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అయితే మాత్రం. మరీ ఇంతలానా.? అందరి మీదా నోరు పారేసుకుంటున్నావ్. ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయితే మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తావా.? అంటూ అభిమానులే కాదు, అభిమానేతరులు కూడా అభిప్రాయపడుతున్నారట
అసలింతకీ విషయమేంటంటే, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల పేరు చెప్పి, ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా, దేశం మొత్తం చుట్టి వచ్చేస్తున్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. దాంతో మీడియా అటెన్షన్ అంతా వాళ్ల పైనే. ఎక్కడికెళితే అక్కడ ముఖాల మీద మైకులు పట్టుకుని వాలిపోతున్నారు మీడియా జనం.
ఆ హడావిడిలో ఏవో వాళ్లకు తోచిన నాలుగు ముక్కలు మాట్లాడేస్తున్నారు సినిమా గురించి జక్కన్న అండ్ టీమ్. అదలా వుంటే, కాస్త ఖాళీ టైమ్ దొరికితే చాలు టీవీ ఛానెళ్లలోనూ, సోషల్ ఛానెళ్లలోనూ ఇంటర్వ్యూల పేరు చెప్పి ఓ సిట్టింగ్ వేసేస్తున్నారు.
ఈ సిట్టింగ్స్‌లో చరణ్ కాస్త ఆచితూచి మాట్లాడుతున్నాడు. కానీ, ఎన్టీయార్ అస్సలేమాత్రం తగ్గట్లేదు. మొన్న సుమ కనకాలకు చాదస్తం ఎక్కువ అంటూ, నోరు పారేసుకున్నాడు. ఆ తర్వాత కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన ‘భీమవరం బుల్లోడా..’ పాట తనకస్సలు నచ్చదంటూ నోరు జారేశాడు. ఫైనల్లీ సినిమా రిలీజవుతోంది కదా.. మీ ఫీలింగ్ ఏంటీ.? అని అడిగితే, చరణ్, రాజమౌళి హమ్యయ్యా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తే, ఏమో నాకింకా డౌటే అంటూ ఎన్టీయార్ ఛలోక్తి విసిరాడు.
ఇలా ఒక్కటి కాదు. రెండు కాదు.. చాలా చోట్ల చాలా రకాలుగా నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు ఎన్టీయార్. టైమ్ అన్నిసార్లూ ఒకేలా వుండదు కదా.. కూసింత జాగ్రత్త చిన్నోడా.! అంటూ ఆయన అభిమానులే స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట.