Health Tips: నో డైట్ …నో వర్కౌట్స్ సులభంగా శరీర బరువు తగ్గవచ్చు.. ఎలాగో తెలుసా?

Health Tips: ప్రస్తుత కాలంలో శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువగా వర్కవుట్ చేయడం డైట్ ఫాలో కావడం వల్ల శరీర బరువు తగ్గుతారని చాలామంది ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఏ విధమైనటువంటి డైట్ వర్కౌట్ లేకుండా తొందరగా శరీర బరువు తగ్గవచ్చు.
సింపుల్ గా చెప్పాలంటే ఇది డైట్ ప్లాన్ కాదు మన జీవన సరళిని మార్చుకోవడం చాలా తక్కువ కాలంలోనే అందరిని ఈ ప్లాన్ ఆకట్టుకుంది. అయితే మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఒకసారి దీని గురించి ఈ ఆర్టికల్ ద్వారా…తెలుసుకోండి

మంచి లైఫ్ స్టైల్, ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం, మరియు బరువు తగ్గడం ఇలా ఈ మూడింటి కోసం చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ను అనుసరిస్తున్నారు. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ లో చాలా విధానాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది అనుసరించే ప్లాన్ 16-8 విధానం మరియు 5:2 విధానం.

16-8 విధానం: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసి ఒకేసారి లంచ్ చేయాలి. తినే సమయాన్ని 8గంటలకు కుదించి మిగిలిన 16గంటలు ఖాళీగా ఉంచాలి. ఉదయం అల్పాహారం మానేసి కేవలం హెల్త్ డ్రింక్స్,నీళ్లు, తక్కువ క్యాలోరిస్ ఉండే ఏవైనా పదార్థాలు అప్పుడప్పుడు తీసుకుంటు మధ్యాన్నం 1-2 మధ్యలో భోజనము తినాలి. రాత్రికి 8గంటలలోపు డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి ఆ తర్వాత తిరిగి మరుసటి రోజు మధ్యాన్నం వరకు ఆహారం తీసుకోకూడదు. మన శరీర అవసరానికి సరిపడా నీళ్లు తాగాలి.దీనివల్ల మన శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వులను కరిగించడం ద్వారా బరువు తగ్గుతుంది.

5:2 విధానం: ఈ విధానంలో వారంలో 5రోజులు ఎటువంటి షరతులు, నియమాలు లేకుండా ఆహరం తీసుకొని రెండు రోజులు మాత్రం మీ డైట్ ను 500నుండి 600 క్యాలోరిస్ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణ కు వారంలో మంగళ వారం గురువారం 500-600క్యాలోరిస్ ఆహరం తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆహరంలో జంకఫుడ్, హై క్యాలోరిఫిక్ ఫుడ్ ను తీసుకుంటే బరువు తగ్గడం కష్టం కాబట్టి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహరం తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కనిపిస్తుంది . ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గుండె జబ్బులు కాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వల్ల HGH హ్యూమన్ గ్రోత్ హార్మోన్ స్థాయి ఒకానొక సమయం లో 5రెట్లు పెరుగుతుంది. ఇది కండర శక్తిని పెంచి శరీర బరువును తగ్గిస్తుంది.