Nithin And Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరి వీర అభిమానుల్లో నితిన్ ఒకడు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌కి నితిన్ భక్తుడు. తన సినిమాల్లో ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్‌ని వాడకుండా వుండడు నితిన్. అలాంటిది పవన్‌తో కలిసి సినిమా చేయాలన్నది నితిన్ డ్రీమ్.
ఆ డ్రీమ్ త్వరలో నెరవేరేలానే కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా వున్నారు. వరుసపెట్టి సినిమాలు పూర్తి చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా పవన్ ప్రాజెక్టుల్లో ఎక్కువగా మల్టీ స్టారర్లే వుండడం విశేషం.
‘వకీల్ సాబ్’ ఓ రకమైన కాన్సెప్టు. ‘భీమ్లానాయక్’ మల్టీ స్టారర్. అలాగే, మేనల్లుడు తేజుతో ఓ సినిమా, చిన్నమేనల్లుడు వైష్ణవ్‌తో ఇంకో సినిమా.. ఇలా పవన్ డైరీలో మల్టీ స్టారర్లు చాలానే వున్నాయ్. మల్టీ స్టారర్ సినిమాలు చేయడంలో పవన్ చాలా ఇంట్రెస్టు చూపిస్తున్నారీ మధ్య.
ఈ లిస్టులోకే ఆయన భక్తుడు నితిన్ కూడా చేరిపోయాడు. నితిన్ తన సొంత బ్యానర్‌లో పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా చేయబోతున్నాడట. తనకు అత్యంత సన్నిహితుడైన మరియు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. ఆల్రెడీ ఆ డైరెక్టర్ ఈ మల్టీ స్టారర్ కోసం కథ కూడా సిద్ధం చేసేస్తున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే ఫుల్ డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి.
