Ambanti Rambabu: సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఈయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ గతంలో కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులను పూర్తి చేస్తూ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల ఈయన నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ సినిమాకు కొంతమేర పాజిటివ్ రివ్యూ ఇస్తున్న మరి కొంతమంది పూర్తి స్థాయిలో నెగెటివిటీ కామెంట్లు చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇంత ఎత్తున లేచే వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబంటి రాంబాబు మాత్రం ఈ సినిమా విషయంలో ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మరోసారి కూడా ఈయన స్పందించారు. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదన్నట్టు చురకలు అంటించారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ కు విలువైన సలహా ఇచ్చారు. పవన్ గారు మిగతా సినిమాలు సైతం వేగంగా పూర్తి చేయండి అంటూ సూచించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి షూటింగ్ పనులను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఉస్తాద్ సినిమా కూడా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా పవన్ సినిమాల గురించి అంబటి వరుస ట్వీట్ లు వేయటంతో కచ్చితంగా ఈ ట్వీట్ల వెనక మరేదో ఉద్దేశం ఉందని ఈయన సెటైరికల్ గా ట్వీట్ వేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
