Nani : ఒక సమస్య వచ్చినపుడు ప్రశ్నించే వాడిపై ఎప్పుడూ ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది కొంతమంది అలాంటివి చెయ్యరు చెయ్యకపోగా చేసిన వారిని హేళన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్ లో నెలకొంది. మంచో చెడో టాలీవుడ్ నుంచి తమకి ఈ సమస్య ఉంది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత నాచురల్ స్టార్ నాని ఓపెన్ గా తన స్పందన తెలిపాడు.
దీనితో అక్కడ నుంచి కొంతమంది నానీని కూడా టార్గెట్ చెయ్యడం స్టార్ట్ చేశారు. కానీ ఈ సమస్యలో తీవ్రత చిన్నది అయితే కాదు ఈ టికెట్ ధరలతో ఏపీలో మేము బతకలేం అని థియేటర్లు మూసేసుకుంటున్న పరిస్థితి. అయితే అసలు ఈ సమస్య మొదలైంది నుంచి టాలీవుడ్ ఎలా ఉంది అనే దానిపై నాని మరోసారి కొన్ని సంచలన కామెంట్స్ చెయ్యడం జరిగింది.
అయితే ఇందులో ఎలాంటి అదనపు మాట లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. అసలు పవన్ వకీల్ సాబ్ సినిమా టైం లోనే అంతా టాలీవుడ్ నుంచి ఒక స్టాండ్ తీసుకొని ప్రభుత్వానికి మాకు ఈ సమస్య ఉంది అని అడిగితే ఈపాటికి ఇలా ఉండేది కాదు, అప్పుడు ఎవరిమట్టుకు వాళ్ళు తమ సినిమా కాదనుకొని ఉన్నారు.
ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ యూనిటీ అనేది మా నుంచి లేదని నాని వ్యాఖ్యానించాడు. మరి ఇది నిజమే అని చెప్పాలి. ఇప్పటి వరకు పవన్, నాని లా అడిగింది ఎవరూ లేరు మరి మిగతా హీరోలు అంతా ఎప్పుడు స్పందిస్తారో ఏంటో..
