Adhire Abhi: జబర్దస్త్ నుండి బయటకు రమ్మని నాగబాబు మమ్మల్ని అడగలేదు.. అదిరే అభి షాకింగ్ కామెంట్స్!

Adhire Abhi: నాగబాబుగారు గానీ, రోజాగారు గానీ తనపై ఎప్పుడూ సీరియస్ కాలేదని, ఎప్పుడూ తిట్టడం అలాంటి సంఘటనలు జరగలేదని జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి తెలిపారు. వాళ్లిద్దరూ కూడా ఇప్పటికీ తనకు చాలా సపోర్ట్ చేస్తారని, చాలా సపోర్టివ్‌గా ఉంటారని ఆయన చెప్పారు. తాను ఏదైనా సినిమా అనుకుంటున్నానని నాగబాబు గారికి చెప్పినపుడు, ఆయన పిలిపించుకొని మరీ తనకు ఏది మంచి, ఏది చెడు అని మాత్రమే కాకుండా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు తనకు చెబుతూ ఉంటారని ఆయన తెలిపారు.

అలాగే రోజా గారు కూడా తనకు ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా, లేదా ఇంకేదైనా అవసరం వచ్చినా ఆమె కూడా వెంటనే రెస్పాండ్ అవుతారని అదిరే అభి స్పష్టం చేశారు. తానొక ఎమ్మెల్యే అని గానీ, ఒక జడ్జ్ పొజిషన్‌లో ఉన్నా అని గానీ అలాంటి ఫీలింగ్‌ లేకుండా తమతో రోజా గారు కలిసిపోతారని ఆయన చెప్పారు. అలా తిట్టించుకునే సందర్భం ఎప్పుడూ రాలేదని, తాను కూడా అలాంటి సిచ్యువేషన్‌ని క్రియేట్ చేయలేదని ఆయన తెలిపారు.

ఇకపోతే నాగబాబు లేనిలోటు మాత్రం జబర్దస్త్‌లో కచ్చితంగా తెలుస్తుందని అదిరే అభి చెప్పారు. అయితే ఆ తర్వాత బాబు గారు చేసిన అదిరింది పోగ్రామ్‌కి రమ్మని పిలవలేదని, అంటే తాను ముందే ఆ విషయంపై ఆయనతో మాట్లాడానని అభి తెలిపారు. తాను అప్పటికే ఒక మూవీకి ఒప్పుకోవడంతో మళ్లీ కొత్త షోలకు వెళ్లాలని అనుకోవడం లేదని తాను ముందే నాగబాబుతో చెప్పానని, దానికి ఆయన కూడా ఓకే అన్నారని అభి చెప్పారు. జబర్దస్త్‌ నుంచి తనను బయటికి రమ్మని నాగబాబు గారు ఎప్పుడూ చెప్పలేదని
అభి స్పష్టం చేశారు. డైరెక్టర్లు అడిగారు, నాగబాబు గారికి సమాధానం చెప్పాము.. అంతేగానీ ఆ విషయంలో ఆయన తనను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదని అదిరే అభి వివరించారు.