‎Varun Tej-Lavanya: తాత కాబోతున్న నాగబాబు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠీ!

Varun Tej-Lavanya: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీ జంటలలో ఈ జంట కూడా ఒకరు. కాగా వరుణ్ తేజ్, లావణ్య లు ఇద్దరు కలిసి 2017లో మిస్టర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత వీరిద్దరు అంతరిక్షం సినిమాలో కూడా నటించారు.

‎ ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. తర్వాత కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఈ విషయాన్ని బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ గత ఏడాది ఎంగేజ్మెంట్ వేడుకతో ఆ విషయాన్ని బయటపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఈ జంట. అయితే వెళ్లి తర్వాత త్వరగా శుభవార్త తెలిపారు.


‎ ఇది ఇలా ఉంటే తాజాగా అనగా కాసేపటి క్రితమే లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వరుణ్ తేజ్ లావణ్యలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్నా మెగాస్టార్ చిరంజీవీ మూవీ సెట్ నుంచి ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. లావణ్య, వరుణ్ తేజ్ వివాహం 2023 నవంబర్ 1 ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే తమ తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు వరుణ్ తేజ్. జీవితంలో అత్యంత అందమైన పాత్రను పోషించనున్నాను. కమింగ్ సూన్ అనే క్యాప్షన్ తో శుభవార్తను పంచుకున్నారు. తాజాగా వీరికి బాబు పుట్టడంతో మెగా ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.