ఒక వ్యక్తి గాని వ్యవస్థ గాని తనకు తెలిసిన విషయాన్ని, తమ knowledge, ఇంటెలిజెన్స్ ని వాడి, విషయాన్ని అనాలీజ్ చేసి ఇతరులకు అందించడమే మీడియా. విషయాన్ని వీక్షకులకు, పాఠకులకు తెలియజేసి, దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, పరిమితి ఇవ్వడమే అసలైన మీడియా చేసే పని. కానీ ఇదంతా ఒక టిపికల్ డెఫినాషన్ మాత్రమే. ఈరోజుల్లో ఉన్న మీడియా చీప్ థంబ్ నెయిల్స్ పెట్టి జనాలు ఎలా ఆలోచించాలో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారు. వార్తా పత్రికలో ఫ్రంట్ పేజీ, న్యూస్ చానెల్స్ లో ఒక్క ప్రోగ్రాం చూస్తే చాలు ఆ పత్రిక, ఛానల్ ఏ రాజకీయ నాయకుడికి చెందిందోనని ప్రజలు ఇట్టే పసిగట్టేస్తున్నారు. కొన్నిసార్లు ఈ న్యూస్ చానెల్స్, వార్త పత్రికల కన్నా ఇన్స్టాగ్రామ్ లో MEME పేజెస్ చాలా ఆక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి.
టీఆర్పీ రేటింగ్స్ కోసం గడ్డి తింటున్నారు
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా సమాచారాన్ని అందించే వారధిగా పని చెయ్యాలి. కానీ ఈరోజుల్లో మీడియా రాజకీయ నాయకులకు, వారి ఐడియాలజీని ప్రజలకు చేరవేసే వారధిగా మారింది. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎంతైనా దిగజారుతున్నారు. ఛానల్ కు రేటింగ్ బాగుంటే ఆ ఛానెల్ కు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ రేటింగ్స్ ను కూడా రిపబ్లిక్ టీవీ, ఇండియన్ టుడే వంటి ఛానల్ యజమానులు కొంటున్నారు. డబ్బులిచ్చి మరీ తమ ఛానళ్ళను నిర్దేశిత సమయాల్లో చూసేలా వీక్షకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయట. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీల సాయంతో ఈ దందా నడుస్తోంది. ప్రజల కోసం నిలబడుతాం అని చెప్పుకునే మీడియా సంస్థలు ఇలా డబ్బు కోసం, రాజకీయ నాయకుల అండ కోసం అమ్ముడుపోతు మీడియాకు ఉన్న గౌరవాన్ని మట్టిలో కలిపిస్తున్నారు.
టెర్రరిజం కన్నా మీడియా ప్రమాదం
దేశంలో ఉన్న అన్ని ట్రడిషనల్ మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు ఎదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నాయి . డబ్బుకు ఆశపడి అబద్దాలను, స్వార్ధపూరిత ఆలోచలను ప్రచారం చేసే మీడియా అధినేతలు టెర్రరిస్ట్ ల కన్నా ప్రమాదకరం. టెర్రరిజం అనేది ఇల్లిగల్ అని తెలుసు కాబట్టి దాన్ని కట్టడి చేయవచ్చు కానీ ప్రజల ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తామని చెప్పే మీడియా వాళ్ళను ఏమి చేయలేము.
మీడియా సంస్థల్లో పనిచేసే వారికి రాజకీయ పార్టీ నాయకులతో ఎంత సత్సంబంధాలు ఉంటాయంటే నా కూతురుని ఒక రాజకీయ నాయకుడు రేప్ చేసాడని ఒక పేదోడు చెప్తే పట్టించుకోని రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా పనిచేసే మీడియా ప్రతినిధులను మాత్రం గర్ల్ ఫ్రెండ్ లా చూసుకుంటారు. ప్రకటనల పేరుతో డబ్బును అధికారికంగా ఇస్తారు, విచ్చలవిడిగా పని చేసుకోవడానికి చట్టటపరమైన భద్రత కలిపిస్తారు.
డిజిటల్ మీడియా రావడం వల్ల కొంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్నారు. అయితే ప్రజల పక్షాన నిలబడే వాళ్లంటే నచ్చని రాజకీయ వాళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. అప్పటికి వినకపోతే ఇంటికి మనుషులను పంపించి మరీ చంపించేస్తున్నారు.
రాజకీయ నాయకులకు భయపడి కొందరు, స్వార్థంతో కొందరు మీడియా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల ఆలోచనలను ప్రతిబింబించలేని వ్యక్తికి మీడియాలో ఉండే అర్హత లేదు.