కౌశల్ మండా.. ఈ పేరు బిగ్ బాస్ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు చాలా వివాదాలని ఫేస్ చేసి సింపతీ పొందిన కౌశల్ బయటకు వచ్చాక కూడా అనేక వివాదాలని ఎదుర్కొన్నాడు. పలు సమయాలలో కౌశల్ అతని భార్య నీలిమ మీడియా ముందుకు వచ్చి వివాదాలపై స్పందించారు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్‌ని కొంత మంది వ్యక్తులు చాలా ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ అన్నింటిని కూల్‌గా సాల్వ్ చేసి ప్రస్తుతం తన లైఫ్‌ను హ్యాపీగా సాగిస్తున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్‌కు బిగ్ బాస్ యాజమార్యం రూ.50 లక్షల ప్రైజ్‌మనీని బహుమతిగా అందించింది. ఇందులో కొంత మొత్తాన్ని తన తల్లి పేరుతో క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందిస్తానని చెప్పుకొచ్చాడు కౌశల్. ఈ ఒక్క మాటతో అతనిని అభిమానించే వారి సంఖ్య మరింత పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయిన తర్వాత కౌశల్‌కు అనేక సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కాని ఏ దర్శక నిర్మాతలు కౌశల్ వైపు కాన్సన్‌ట్రేషన్ చేయకపోవడంతో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.
కౌశల్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే ముందు ఎన్నో ఆలోచనలు, మరెన్నో ఆశలు ఉన్నాయని చెప్పాడు. ముఖ్యంగా సొంతింటి కల ఒకటి ఉందని చెప్పిన కౌశల్ తాజాగా దానిని సాకారం చేసుకున్నాడు. తన సతీమణి నీలిమతో కలిసి రీసెంట్‌గా కొత్తింట్లోకి అడుగుపెట్టాడు. కౌశల్ గృహ ప్రవేశంకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వారికి పలువురు ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.