టైటిల్ గెలవటానికి కౌశల్, అభిజిత్ చేసినది తప్పు కానప్పుడు నేను చేస్తే మాత్రం తప్పేంటి?

దేశవ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రచారం అవుతుంది ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల ప్రారంభమైన ఆరవ సీజన్ కూడా ఇప్పటికే 9 వారాలు పూర్తిచేసుకుని పదవ వారంలో కొనసాగుతోంది. ఈ తొమ్మిదవ వారంలో అనూహ్యంగా గీతు రాయల్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిగ్ బాస్ రివ్యూవర్ గా గుర్తింపు పొందిన గీతు. ఈ ఆరవ సీజర్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ప్రతిక్షణం టైటిల్ దక్కించుకోవడానికి ఆరాట పడుతూ కష్టపడింది.

ఈ క్రమంలో ఎమోషన్స్ తో సంబంధం లేకుండా చాలా పట్టుదలగా తనదైన శైలిలో గేమ్ ఆడుతూ టైటిల్ ఫేవరెట్ గా నిలిచింది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో గీతు తన తెలివిని ఉపయోగించి ఎదుటివారి ఎమోషన్స్ తో ఆడుకోవడంతో ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ చేశారు. ఇలా ఊహించని విధంగా ఎలిమినేట్ అవ్వడంతో గీతు చాలా ఎమోషనల్ అయ్యి బోరున విలిపించింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత గీతు ఇప్పటివరకు బయట కనిపించలేదు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో బిగ్ బాస్ లో తన జర్నీ గురించి వివరిస్తూ చాలా ఎమోషనల్ అయ్యింది.

ఈ క్రమంలో గీతు మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్లే ఈరోజు ఇలా నేను ఎలిమినేట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే విధానం మార్చుకోమని తన తల్లి ఎన్నిసార్లు చెప్పినా తాను వినిపించుకోలేదని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో నేను ఎప్పుడూ ఒక గేమర్ గానే ఆట ఆడానని ఎవరితోను రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నించలేదని చెప్పుకొచ్చింది. ఇదివరకే కౌశల్ కూడా ఇలా కేవలం ఆటకోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని చెప్పినప్పుడు తను అందరికీ నచ్చాడు. కానీ ఆ మాట నేను చెబితే మాత్రం ఎవ్వరికి నచ్చటం లేదు అంటూ ఎమోషనల్ అయింది. ఇక అభిజిత్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో రెండు సంచులు ముడివేసి తెలివిగా ఆట ఆడినప్పుడు అందరూ అభిజిత్ చాలా తెలివైనోడు అని పొగిడేశారు. కానీ నేను మాత్రం అలా ఆడితే తప్పు పడుతున్నారు. వాళ్లు చేస్తే తప్పు లేదు. కానీ నేను చేస్తే మాత్రం తప్పేంటి? అంటూ చాలా ఎమోషనల్ అయింది.