అగ్నిపథ్ వివాదం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్… శాంతియుతంగా పరిష్కరించవచ్చు?

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న అగ్నిపథ్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొందరు నిరసనకారులు పెద్ద ఎత్తున దాడి చేసి కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగించారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై నటుడు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ స్పందించారు.

సోషల్ మీడియా వేదికగా కౌశల్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అగ్నిపథ్ వివాదం పై తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తూ కోట్లలో ఆస్తినష్టం కలిగించారు. అయితే నష్టపోయిన ఆ సంపద మొత్తం దేశ ప్రజలకు సంపద అని, నష్టపోయిన ఆస్తిని టాక్స్ రూపంలో మన నుంచే వసూలు చేస్తారని ఆయన తెలిపారు. విషయం ఏదైనా ఇలాంటి ఉన్మాదం, ఆక్రోశం పనికి రాదని శాంతియుతంగా కూడా ప్రభుత్వాలను కదలించవచ్చు అని ఈ సందర్భంగా కౌశల్ సికింద్రాబాద్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధంగా కౌశల్ అగ్నిపథ్ ఈ వివాదంపై స్పందిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కొందరు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయగా మరికొందరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచన ఎంతో అద్భుతం అని, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ వివాదం పై బాలీవుడ్ నటి కంగనా స్పందిస్తూ అగ్నిపథ్ పథకాన్ని ఏకంగా గురుకులాలతో పోలుస్తూ కామెంట్లు చేశారు.