చావు బతుకుల మధ్య జబర్దస్త్ వర్ష..అసలు విషయం చెప్పిన వర్ష!

మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా బుల్లితెర మీద సత్తా చాటుకున్న వర్ష ఇప్పుడు జబర్ధస్త్ వర్ష గా మారిపోయింది. ఈటీవిలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ షో ద్వారనే లేడి గెటప్ కూడా ఫేమస్ అయ్యాయి. అయితే అంతకుముందు జబర్ధస్త్ షో అంటే కేవలం మగవారికి సంబంధించిన షో లాగా ఉండేది. కానీ ఇప్పుడు జబర్ధస్త్ లో పరిస్థితులు అన్ని మారిపోయాయి. ప్రస్తుతం ఎంతోమంది లేడి ఆర్టిస్టులు కూడా జబర్ధస్త్ స్టేజ్ మీద సందడి చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. అలా జబర్ధస్త్ ద్వారా ఫేమస్ అయిన ఫీమేల్ ఆర్టిస్టులలో వర్ష కూడా ఒకటి.

హైపర్ ఆది జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత జబర్దస్త్ రేఖలు మారిపోయాయి అనటంలో సందేహం లేదు. బుల్లితెర మీద సీరియల్స్ లో సందడి చేస్తున్న వర్ష జబర్దస్త్ కి తీసుకువచ్చిన ఘనత ఆదికే దక్కుతుంది. వర్ష తన అందంతో పాటు కామెడీ టైమింగ్ తో కూడా అతి తక్కువ కాలంలోనే బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. అంతేకాకుండా ఇమాన్యుల్ తో వర్షకి ఉన్న లవ్ ట్రాక్ వల్ల మరింత ఫేమస్ అయ్యింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉండే వీరిద్దరు ప్రేమ పేరుతో జబర్దస్త్ స్టేజి మీద చేసిన రొమాన్స్ వల్ల వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారు అంటూ ప్రేక్షకులు కూడా నమ్మారు. అంతే కాకుండా జబర్ధస్త్ స్టేజి మీద వీరిద్దరికీ పెళ్ళి కూడా చేశారు. దీంతో ఈ జంట ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్ధస్త్ వర్షకి సంబందించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల యూట్యూబ్ లో జబర్దస్త్ అనారోగ్యం గురించి ఇక యూట్యూబ్ ఛానల్ వాడు చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే వర్ష యూట్యూబ్ లో తన గురించి వచ్చిన వార్తలపై స్పందించింది. ఈ క్రమంలో ‘చావు బతుకుల మధ్య జబర్ధస్త్ వర్ష.. కుప్పకూలిన సుధీర్, రష్మీ, ఇమ్మాన్యూయేల్’ అని యూట్యూబ్‌లో కనిపించిన న్యూస్‌ థంబ్‌నెయిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ వార్త గురించి క్లారిటీ ఇచ్చింది. నా అనారోగ్యం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను ఇప్పుడు చాలా సేఫ్ గా ఉన్నాను అంటూ అదే పోస్టులో అందరికీ క్లారిటీ ఇచ్చింది.