లిక్క‌ర్ కింగ్ ఇక క‌ట‌క‌టాల వెన‌క్కే?

లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా క‌థ కంచికి చేరిందా? భార‌త్ జైళ్ల‌లో ఊచ‌లు లెక్క‌ట్ట‌డానికి రంగం సిద్ధం అవుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. భార‌త్ బ్యాంకుల‌కు 9 వేల కోట్లు పంగ‌నామం పెట్టి విదేశాలు పారిపోయిన లిక్క‌ర్ కింగ్ అక్క‌డ ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. 2016 లో బ్రిట‌న్ పారిపోయిన మాల్యా అప్ప‌టి నుంచి అక్క‌డే ఉంటున్నాడు. నాటి నుంచి భార‌త్ లో న‌మోదైన కేసుల నుంచి ఎలాగైనా త‌ప్పించుకోవాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇండియా పంపించోద్ద‌ని బ్రిట‌న్ అధికారుల‌ను…యంత్ర‌గాన్ని ఇన్నాళ్లు విన్నవించుకుంటూ వ‌చ్చాడు. అక్క‌డ ప్ర‌భుత్వం నుంచి చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేసాడు.

అయితే మే 14న బ్రిట‌న్ సుప్రీంకోర్టు మాల్యాకున్న ఒకే ఒక్క అవ‌కాశాన్ని కూడా కొట్టిపారేసింది. శిక్షార్హుడువి అంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ త‌ర్వాత భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కాకా ప‌ట్టే ప్ర‌య‌త్నం చేసాడు. చేసిన అప్పులు మొత్తం చెల్లిస్తాన‌ని… లిక్క‌ర్ కింగ్ గానే పురిట గడ్డ‌పై కాలు పెట్ట‌లని ఎంత‌గానో ప్ర‌య‌త్నాలు చేసాడు. ఈ క్ర‌మంలో ఎన్నో విన‌తులు స‌మ‌ర్పించాడు. కానీ ఒక్క దానికి కూడా ప్ర‌భుత్వం ప్ర‌తిస్పందించ‌లేదు. నువ్వు దోషివి…భార‌త్ ని దోచుకున్న గ‌జ‌దొంగ..నువ్వు ఊచ‌లు లెక్కాట్టాల్సిందే అన్న‌ట్లు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. మొన్న‌టి తీర్పుతో మాల్యాకున్న చివ‌రి అవ‌కాశం కూడా కోల్పోయాడు.

దీంతో భార‌త ప్ర‌భుత్వ అధికారుల‌ను మాల్యాని ఇండియాకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. మాల్యాను ఏ క్ష‌ణ‌మైనా ఇండియాకు తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బ్రిట‌న్ ఆర్ధిక మంత్రి సంత‌కం చేయ‌గానే మాల్యాను భార‌త అధికార‌ల‌కు అప్ప‌గించ‌నున్నారు. మాల్యాపై తొలుత ముంబైలోనే కేసు న‌మోదైంది కాబ‌ట్టి లండ‌న్ నుంచి నేరుగా ముంబై తీసుకురానున్నారు. సీబీఐ, ఈడీ కోర్టులో హాజ‌రు ప‌రిచి..అక్క‌డ నుంచి నేరుగా ముంబై ఆర్థ‌ర్ రోడ్ జైలుకు త‌ర‌లించ‌నున్నారు. విజ‌య్ మాల్యా ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వ‌గానే ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ కోర్టుకి..అటుపై జైలుకి త‌ర‌లిస్తారు.