“ఆచార్య”లో హైలైట్ సీన్..చరణ్ పాత్రలపై ఇంట్రెస్టింగ్ సమాచారం.!

Interesting Update On Acharya Highlight Scene And Ram Charan Role | Telugu Rajyam

టాలీవుడ్ నుంచి రాబోతున్న సూపర్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ సినిమా “ఆచార్య” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి మొన్ననే సిద్ధ టీజర్ రావడం అందులో హైలైట్ షాట్ కోసం మంచి చర్చ జరిగింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సన్నివేశం పై అలాగే రామ్ చరణ్ పాత్ర సినిమాలో ఎంత సేపు ఉంటుంది అనే దానిపై సమాచారం బయటకి వచ్చింది. మొదటి దానిపై కొరటాల నే క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఈ సన్నివేశం కావాలని పెట్టినది కాదు అని ఒక ఆర్గానిక్ గా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా వస్తుంది అని అలాగే ఇలాంటి సన్నివేశం చిరు చరణ్ లకి తప్పితే మరొకరికి సెట్టవ్వదని కొరటాల సెలవిచ్చారు.

ఇక రామ్ చరణ్ రోల్ సినిమాలోకి వస్తే ఇది సెకండాఫ్ లో ఎంటర్ అవుతుందట అలాగే తన పాత్ర 40 నిముషాలు పాటు ఉందని సమాచారం అలానే చిరు మరియు చరణ్ ల మధ్య సాంగ్ కూడా సినిమాలో ఇంకో బిగ్ హైలైట్ గా నిలవనుంది అని సమాచారం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles