Chiranjeevi: డైరెక్టర్ చెప్పినట్టే చేసాం… ఆచార్య విషయంలో ఆ బాధ ఎప్పటికీ తీరదు… చిరు సంచలన వ్యాఖ్యలు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఏడుపదుల వయసుకు చేరువవుతున్న యువహీరోలకు పోటీ ఇస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటించిన విశ్వంభరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సరైన స్థాయిలో హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారని చెప్పాలి. ఈయన నటించిన సినిమాలు పరవాలేదు అనిపించుకుంటున్నాయి అలాగే ఆచార్య భోళా శంకర్ వంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోవడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విశ్వంభర సినిమా పై మెగా అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ తన ప్లాప్ సినిమాల గురించి సూపర్ హిట్ సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా…ఫ్లాప్ మూవీస్ ని ఎలా తీసుకుంటారు? ఆచార్య లాంటి మూవీ నిరాశపరిచినప్పుడు ఎలా ఫీలయ్యారు? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ.. నా కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసే వాడిని. ఫెయిల్యూర్ వస్తే బాగా కృంగిపోయే వాడిని ఇది కెరియర్ బిగినింగ్ లో జరిగింది.ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చాక హిట్స్, ఫ్లాపులని పట్టించుకోవడం మానేశాను.

ప్లాప్ సినిమాలు నాపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి అలాగే ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొనే శక్తి కూడా నాకు వచ్చిందని చిరంజీవి తెలిపారు. ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కూడా నాపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు డైరెక్టర్ చెప్పింది అల్లా మేము చేశామని చిరంజీవి తెలిపారు అయితే ఈ సినిమా విషయంలో ఒక బాధ ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందని తెలిపారు. మొదటిసారి నేను చరణ్ ఇద్దరు కలిసి నటించిన సినిమా ఇలాంటి ఫలితాలను ఇవ్వటం బాధాకరం అంటూ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.