వైరల్ : సినిమా ఛాన్సుల కోసం మణిశర్మ ఎమోషనల్ 

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో మణిశర్మ కూడా ఒకరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్, బాలయ్య, పవన్, మహేష్ ఇంకా ఎన్టీఆర్ సహా ఎందరో యంగ్ హీరోస్ కి కూడా మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మరో లెవెల్.

అయితే దాదాపు 2 దశాబ్దాలు పైగా నుంచి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు కానీ తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు ఎంటర్ అయ్యాక మణిశర్మ సినిమాలు తక్కువ అయ్యాయి ఒక టైం లో అయితే అసలు ఏ సినిమాలు చేస్తున్నారో కూడా అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.

అయినా కూడా మధ్యలో చేసిన పలు చిత్రాలకి స్టన్నింగ్ మ్యూజిక్ ని ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా తాను అందించారు. కాగా ఎందరో స్టార్స్ కి మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ మ్యూజిక్ ని అందించిన తాను ఇప్పుడు ఛాన్సుల కోసం అడగడం అనేది ఒకింత బాధాకరంగా మారింది.

పవన్ కానీ మహేష్ గాని అలాంటి హీరోస్ తనతో కూడా సినిమాలు ఇపుడు చేస్తే బాగుంటుంది అని దేవి థమన్ లతో పాటుగా తనని కూడా సినిమా సంగీతం ఇవ్వమంటే వాళ్ళకెన్ని సినిమాలు ఇస్తున్నారో నాకు అలా కాకపోయినా వాళ్ళకి రెండు ఇచ్చి నాకు ఒకటైన ఇస్తే బాగుంటుంది అని చాలా ఎమోషనల్ అయ్యారు. దీనితో ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఒక సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్న కేశవరెడ్డి, ఇంద్ర, ఆది ఇపుడు ఆచార్య, రెడ్, ఇస్మార్ట్ శంకర్, జెంటిల్మన్ లాంటి ఆల్బమ్స్ ని ఇచ్చిన తాను ఇపుడు ఇలాంటి పరిస్థితిలో ఉండడం తన ఫ్యాన్స్ ని కూడా మరింత బాధిస్తుంది. మరి మణిశర్మ ఆవేదన మన పెద్ద హీరోల వరకు వెళుతుందో లేదో చూడాలి.