Gallery

Home News ఇదేమి భద్రత రా బాబోయ్ - ఒక్కసారి హైదరబాద్ ని చూడండి !

ఇదేమి భద్రత రా బాబోయ్ – ఒక్కసారి హైదరబాద్ ని చూడండి !

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఉన్న హడావిడి కన్నా కూడా ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉంది. అసలు దుబ్బాక ఎన్నికలకు ముందు వరకు తెరాసను దెబ్బకొట్టే పార్టీ తెలంగాణలో వస్తుందని ఎవ్వరు అనుకోలేదు కానీ ఇప్పుడు బీజేపీ సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపిస్తుంది. ఏకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ పెద్దలైన అమిత్ షా, యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైద్రాబాద్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Kcr And Bjp In Ghmc Polls
BJP for the first time appears as strong contestant in GHMC polls

జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీసుల ఏర్పాట్లు:

* ఎన్నికల భద్రత కోసం 13,500 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. హైద్రాబాద్ పోలీసులు 9 వేళ మందికి తోడు వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలు రానున్నాయి. 10,500 సివిల్, 3000 మంది ఏఆర్ సిబ్బంది ఉంటారు.

* ఎన్నికల విధులకు సంబంధించి పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చారు. విడతల వారీగా వారికీ శిక్షణ పూర్తి చేసారు. అత్యవసరం వేళ ఇలా స్పందించాలి.. సున్నితమైన ప్రాంతాల్లో ఇలా నడుచుకోవాలి..? ఇలా విధుల్లో ముందుకు వెళ్లాలనే అంశాలను ఈ సరి పోలీసులకు ప్రత్యేకంగా ఇచ్చారు. హైద్రాబాద్ లాంటి నగరాల్లో ఏదైనా చిన్న గొడవ సైతం మొత్తం నగరమంతా నిమిషాల్లో పాకే అవకాశం ఉండటంతో దాని నిరోధానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు.

* ఎన్నికల రోజు సోషల్ మీడియా పుకార్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలపై ఒక కన్నేసి ఉంచేందుకు 25 మందితో కూడిన ఒక సాంకేతిక బృందాన్ని నియమించారు.

* నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ, సిఐ స్థాయి అధికారి, ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేసారు.

* 38 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు అందుబాటులో ఉంటాయి. ఏఏ ఫోర్స్ లకు ఎలాంటి విధులు.. ఇలా స్పందించాలి అనే విషయాలపై ఇప్పటికే వారికీ తగిన సూచనలు ఇచ్చారు.

* 73 హైపర్ సెన్సిటివ్ పికెట్ లు నియమించి కట్టుదిట్టమైన భద్రత పెంచారు. ఈ పికెట్ల వద్ద పోలీసులు చెప్పినట్లే నడుచుకోవాలి.
* హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద 1 ఎస్ ఐ, 4 ఏఆర్ సిబ్బంది ఉంటారు. వీరికి స్థానికులు సహకరించాలి.

* ఇక సైబరాబాద్ కమిషనరేట్ లో 38 వార్డ్ లు ఉన్నాయి. 2437 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ఇక్కడ 1421 నార్మల్ పోలింగ్ స్టేషన్ లు, 766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
250 అత్యంత సమస్యాత్మక/ Hyper Sensitive పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.

* సైబరాబాద్ పరిధిలో 177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తారు. సైబరాబాద్ లో 15 బార్డర్ చెక్ పోస్ట్ లు పెట్టారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 73 పికెట్ లు ఉంటాయి.

* ఎప్పటి వరకు 587 లైసెన్సేడ్ గన్స్ డిపాజిట్ చేయించుకున్నారు. 369 మంది రౌడీ షీటర్ లను బైండోవర్ చేసుకున్నారు. రూ. 15 లక్షలు విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు.

* ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ చేసి , సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు . సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేసి నిత్యం నిఘా ఉంచుతారు.

* ఇక అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటారు. ఎవరికీ సెలవులు ఇవ్వకుండా అందరు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆర్డర్స్ వచ్చాయి. డిసిపి, ఏ సిపి ఆఫీస్ లో రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రం మొత్తం ఈ ఎన్నికల వైపు చూస్తుంది. కాబట్టి ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి. ఇప్పటికే బండి సంజయ్ పై కొందరు దుండగులు దాడి చేశారు. దింతో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దాని కంటే కూడా ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

- Advertisement -

Related Posts

Latest News