Crime News: ఆస్తిలో వాటా తీసుకురావాలని భార్యను వేధించిన భర్త.. వేధింపులు భరించలేక డాక్టర్ ఆత్మహత్య..!

Crime News: సమాజం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందింది. మహిళలు పురుషులకు ధీటుగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి వారికి సమానంగా సంపాదిస్తున్నారు. అయినప్పటికీ ఈ రోజుల్లో కూడా మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. జీవితంలో బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడిన వారు కూడా అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ బాధలు భరించలేక ఎంతోమంది మహిళలు మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…నల్గొండ జిల్లా దామరచర్లవాసి గంగనపల్లి కాశీ విశ్వనాథం కుమార్తె డాక్టర్ స్వప్న మహిళకు మొదట మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో అయింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పీహెచ్‌సీలో పనిచేస్తున్న క్రమంలో అనివార్య కారణాలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.అనంతరం 2015 ఏప్రిల్ లో కర్నూలుకు చెందిన డాక్టర్‌ ఎం.శ్రీధర్‌తో రూ.10 లక్షల నగదు, 14 తులాల బంగారం కట్నంగా ఇచ్చి తల్లితండ్రులు వివాహం జరిపించారు.

ఈ క్రమంలో స్వప్నకు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎండీ (ఎస్‌పీఎం) సీటు వచ్చింది. దంపతులిద్దరూ సైదాబాద్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో ఇద్దరు నివాసం ఉంటున్నారు. కొంత కాలం సాఫీగా సాగిపోయిన వారి సంసారంలో అదనపు కట్నం కోసం శ్రీధర్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఇంట్లో సగ భాగం వాట, తన తల్లి బంగారు నగలు తీసుకురావాలని స్వప్నను తీవ్ర వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో స్వప్న తీవ్ర మనస్తాపానికి లోనై ఈనెల 8న స్వప్న ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి బాధితురాలి భర్త డాక్టర్ శ్రీధర్ నీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.