Anasuya: ఏంటి అనసూయ తన భర్తతో అలాంటి ఒప్పందం చేసుకుందాం… అందుకే ఇలా రెచ్చిపోతోందా?

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అనసూయ కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్గా పనిచేశారు అనంతరం చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చారు..

ఇక ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయిన అనసూయ అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు ఇలా పలు సినిమాలలో నటిస్తున్న ఈమెకు రంగస్థలం సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావడంతో అనసూయకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో అవకాశాలు రావడంతో ఈమె బుల్లితెరకు కూడా దూరమయ్యారు.

ప్రస్తుతం స్టార్ మా లో కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై తన అంద చెందాలని ఆరబోస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న అనసూయ బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వకముందే తన భర్తతో ఒక ఒప్పందం చేసుకున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

ఈ విషయం గురించి అనసూయ మాట్లాడుతూ … టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడానికి కంటే ముందుగానే తన భర్త సుశాంత్ ఒక ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. 15 ఏళ్ల వరకు తనకు కెరీయర్ ఉంటుందని ముందే పర్మిషన్ తీసుకున్నానని చెప్పింది. నటిగా టెలివిజన్ రంగంలో కాస్తో కూస్తో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా నేను బిజీ అయినప్పటికీ ఒక తల్లిగా ,ఒక కోడలిగా, భార్యగా నేను చేయాల్సిన పనులను చక్కబెడుతున్నాను కాబట్టి నా కుటుంబ సభ్యులందరూ కూడా నా పనీకి సహకరిస్తున్నారని అనసూయ ఈ సందర్భంగా ఇండస్ట్రీలోకి రాకముందు తన భర్తతో చేసుకున్న ఒప్పందం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.