జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్, ఆమె వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. తన కష్టంతో తానే కాకుండా తన కుటుంబానికి కూడా పేరు తెచ్చే ప్రయత్నంలో ఉంది. కానీ ఈ యువ క్రీడాకారిణి జీవితాన్ని ఆమె తండ్రి దీపక్ ముగించాడు. సాధారణంగా తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ, అనురాగం ఉండాలి. కానీ పిచ్చి గర్వం, అహం, అవమానం దీపక్‌ను తన కూతురి ప్రాణాలను తీసేలా చేసింది.
రాధిక గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లో తన స్వంత టెన్నిస్ అకాడమీని స్థాపించి ఒక్కసారిగా ఫోకస్‌లోకి వచ్చింది. ఈ అకాడమీ స్థాపనతో దీపక్, రాధిక పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. వజీరాబాద్ గ్రామస్తులు దీపక్‌ను తన కుమార్తె డబ్బుతో తాను తింటున్నానని ఆటపట్టించారని అతను పోలీసులకు చెప్పాడు. ఈ అవమానం కారణంగా అకాడమీని మూసివేయాలని తన కుమార్తెను పట్టుబట్టాడు. అయితే రాధిక దానికి ససేమెరా అంది.
మరోవైపు రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కార్వాన్’ పాట వీడియోలో కనిపించడం దీపక్‌ను తీవ్రంగా వ్యతిరేకించడాన్ని పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో రాధిక గాయని భుజంపై తల పెట్టుకుని ఉన్నట్లు కనిపించింది. దీపక్ ఈ వీడియో పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. చాలా నెలలుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతకు ఈ వీడియో ప్రధాన కారణం అని చాలామంది నమ్ముతారు.
అయితే పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హత్య జరిగిన రోజు ఉదయం రాధిక, దీపక్ అకాడమీని మూసివేయాలని వాదించుకుంది. కోపంతో దీపక్ తన కుమార్తెను కాల్చి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
