Sri Reddy : శ్రీరెడ్డికి జ్ఞానోదయం ఎలా అయ్యిందంటే.!

Sri Reddy : శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన పనేముంది.? సిగ్గూ ఎగ్గూ వదిలేసి మరీ రోడ్డెక్కి నానా యాగీ చేసింది కొన్నాళ్ళ క్రితం. ఆమెకు సినీ పరిశ్రమలో అన్యాయమే జరిగి వుండొచ్చు. తనలా చాలామంది సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె అనుకోవచ్చు. కానీ, నిరసన తెలిపే పద్ధతి అదా.? వస్త్ర సన్యాసం బహిరంగంగా చేయడమా.? దానికి తోడు, చిరంజీవి మాతృమూర్తి అంజనమ్మపై దూషణలకు దిగడమా.?

ఎవరో తెరవెనుకాల వుండి శ్రీరెడ్డితో అలా బూతులు తిట్టించారని అప్పట్లోనే అందరికీ అర్థమయ్యింది. కానీ, ఆమె తన తీరుని అప్పట్లో సమర్థించుకుంది. రోజులు గడిచాయ్.. నెలలూ గడిచాయ్. ఎలాగైతేనేం, శ్రీరెడ్డికి జ్ఞానోదయమయ్యింది. చేసిన తప్పు తెలుసుకుంది. క్షమాపణలు చెప్పింది.

ఓ పెద్దమనిషి కారణంగా తాను అలా చేయాల్సి వచ్చిదంటూ శ్రీరెడ్డి తాజాగా సెలవివ్వడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఎవరా పెద్దమనిషి.? వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కథంతా నడిపించాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. శ్రీరెడ్డి కూడా అలాగే హింట్ ఇచ్చింది.

అప్పట్లో ఓ ఛానల్ అధినేత (ఇప్పుడు ఆ ఛానల్ నుంచి అతన్ని గెంటేశార్లెండి) కూడా ఈ కుట్రలో భాగం పంచుకున్నాడనే ఆరోపణలున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పేర్లు కూడా వినిపించాయి.. శ్రీరెడ్డి వ్యవహారంలో. అంతేనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి.

అయితే, శ్రీరెడ్డి మాత్రం తనను అలా నడిపించిన ఆ వ్యక్తుల వివరాల్ని మాత్రం బయటపెట్టలేకపోయింది. బయటపెడితే ఏమవుతుందోనని ఇంకా ఆమె భయపడుతూనే వుందేమో.! ఇంతకీ, శ్రీరెడ్డికి ఇంత జ్ఞానోదయం ఎలా జరిగిందట.? చెప్పుడు మాటలు విని తాను చేసిన చెత్త పని వల్ల వచ్చిన పబ్లిసిటీ కంటే, పోగొట్టుకున్నదేనని ఆమెకు తెలిసొచ్చి, ఇదిగో ఇలా క్షమాపణ పర్వానికి తెరలేపిందంటున్నారు.

అంతేనా.? కొత్త వివాదానికి ఆమె స్కెచ్ రెడీ చేసుకుంటోందని అనుకోవాలా.?