Baby Care: మీ పిల్లలు తరచూ జలుబుతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో వారి సమస్యను దూరం చేయవచ్చు..!

Baby Care: శీతాకాలం వచ్చిందంటే చాలు పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు అందరూ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వల్ల చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది . శీతాకాలంలో తరచుగా వ్యాపించే జలుబు , దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులతో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు . చిన్నపిల్లలు తరచూ జలుబుతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటిలో ఉపయోగించే చిట్కాల ద్వారా వారి సమస్య దూరం చేయవచ్చు.

పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు తరచూ ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి . అందువల్ల పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. పిల్లల్లో ఇమ్యూనిటీపవర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధులు వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుంది. జలుబుతో బాధపడే పిల్లల్లో వారి శరీరం డీహైడ్రేట్ అయ్యి డయేరియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లలకు జలుబు చేసినప్పుడు వీలైనంత వరకు పిల్లలు డీహైడ్రేషన్ కి గురికాకుండా లిక్విడ్ ఎక్కువగా ఇవ్వాలి.

జలుబు చేసినప్పుడు పిల్లలకు గోరువెచ్చని నీటిని తాపించటం శ్రేయస్కరం . జలుబు చేసినప్పుడు పిల్లల్లో చాతిలో కఫం ఏర్పడి ఇబ్బంది పడుతుంటారు. వేడి నీటిని తాగించడం వల్ల చాతిలో ఉన్న కఫం తొలగిపోయి ముక్కు రంధ్రాలు కూడా తెరుచుకుంటాయి . అందువల్ల పిల్లలకు జలుబు చేసినప్పుడు తరచూ గోరువెచ్చని నీటిని తాగిస్తూ ఉండాలి .

సాధారణంగా జలుబు చేసినప్పుడు ఆవిరి పెట్టుకోవడం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది . కానీ చిన్న పిల్లలు ఆవిరి పట్టుకోవటానికి మారం చేస్తుంటారు . కానీ నీ పిల్లలకు ఆవిరి పట్టడం వల్ల జలుబు దగ్గు నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది.

పూర్వకాలం నుండి జలుబు చేసినప్పుడు వెల్లుల్లి రెబ్బలను ఆవ నూనెలో వేయించి ఆ నూనె చల్లార్చిన తర్వాత పిల్లలకు ఒళ్ళు మొత్తం మసాజ్ చేసేవారు. ఇలా చేయడం వల్ల పిల్లలు జలుబు నుండి తొందరగా విముక్తి పొందుతారు . రాత్రి పిల్లలు నిద్ర పోయిన తర్వాత ఇలా మసాజ్ చేసి స్నానం చేయించకూడదు.

మీ పిల్లలు జలుబు , జ్వరం తో బాధపడుతున్నట్లయితే వారికి స్నానం చేయకపోవడం మంచిది . జలుబు చేసినప్పుడు పిల్లలకు స్నానం చేయించ కుండా వేడి నీటిలో టవల్ అద్ది వాళ్లంతా తుడవాలి . ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్ల మీ పిల్లలు జలుబు నుండి తొందరగా విముక్తి పొందుతారు .