ఉచితంగా వస్తున్నాయి కదా అని పొరపాటున కూడా ఈ వస్తువులను తీసుకోకండి?

సాధారణంగా ఏదైనా ఉచితంగా వస్తువులు వస్తున్నాయంటే తీసుకోవడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు. అయితే కొన్ని వస్తువులు ఉచితంగా వస్తున్నాయి కదా అని తీసుకుంటే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఉచితంగా కొన్ని వస్తువులను తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి ఏ వస్తువులను దానంగా తీసుకోకూడదనే విషయానికి వస్తే….

సాధారణంగా ఇనుము వస్తువులపై శని ప్రభావం ఉంటుందని భావిస్తారు. అందుకే ఇతరులు ఉచితంగా ఇనుముకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే పొరపాటున కూడా తీసుకోకూడదు.ఇలా వారు ఉచితంగా ఇస్తున్న తీసుకోకుండా కొంత మొత్తంలో డబ్బును ఇచ్చి తీసుకోవాలి.ముఖ్యంగా శనివారం పూట మనం డబ్బును పెట్టి కూడా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు.ఎవరైనా మీకు హ్యాండ్ కర్చీఫ్ ఉచితంగా ఇస్తే వెంటనే దాన్ని ఇతరులకు దానం చేయండి. అంతేకానీ మీరు మాత్రం ఉపయోగించకూడదు. ఇలా బహుమతిగా ఇచ్చిన హ్యాండ్ కర్చీఫ్ వాడటం వల్ల వారితో అభిప్రాయ భేదాలు వస్తాయి.

ఇక ఎవరితో నుంచైనా ఉప్పును దానంగా తీసుకున్న వెంటనే తిరిగి వారికి ఉప్పు ఇవ్వండి లేదంటే ఉప్పుకు బదులు మరొక వస్తువును దానంగా ఇవ్వాలి. ఉప్పుకి శని దేవునికి సంబంధం ఉంది కనుక శని ప్రభావం మనపై ఉంటుంది. అందుకే ఉప్పును కూడా ఉచితంగా తీసుకోకూడదు. అలాగే ఆవ నూనెతో పాటు సూది దారం కూడా ఎవరితోనూ ఉచితంగా తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల శని ప్రభావానికి గురి కావలసి ఉంటుంది.