శీతాకాలంలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కొన్నిసార్లు ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. శీతాకాలంలో బెల్లం ముక్క తింటే ఆరోగ్య సమస్యలను కొంతమేర అధిగమించే అవకాశాలు ఉంటాయి. శీతాకాలంలో బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియంతో పాటు ఐరన్, జింక్, కాల్షియం బెల్లం ద్వారా లభిస్తాయి. పీరియడ్స్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు అజీర్తి, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో బెల్లం తోడ్పడుతుంది. ఒక విధంగా బెల్లం సర్వరోగ నివారిణిలా పని చేస్తుంది. జలుబు, దగ్గును నివారించడంలో బెల్లం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. జీర్ణక్రియ ప్రక్రియను బెల్లం మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు బెల్లం తినడం వల్ల ఆ సమస్యను అధిగమించవచ్చు. బెల్లం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు మన శరీరం ఆరోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. ఇందులోని ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచడంలో ఉపయోగపడుతుంది. బెల్లం తినడం వల్ల శరీరానికి లాభమే తప్ప నష్టం ఉండదు.
బెల్లం తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుందని చెప్పవచ్చు. బెల్లం తినడం వల్ల శరీరానికి లాభాలే తప్ప నష్టాలు లేవు. బెల్లం తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మధుమేహంతో బాధ పడేవాళ్లు మాత్రం బెల్లం ఎక్కువగా తీసుకోకూడదు.