ఊర్మిళాదేవి 14 సంవత్సరాల నిద్రపోవడానికి అసలు కారణం ఇదేనా… ఇంత కథ ఉందా?

రామాయణం గురించి తెలియని వారు ఉండరు. రామాయణ ఇతిహాసాన్ని ప్రజలందరికీ తెలిసేలా సినిమాలు కూడా తీశారు. రామాయణంలో దశరథ మహారాజు ఆదేశం మేరకు శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి 14 సంవత్సరాలు వనవాసం వెళ్తాడు. రామాయణంలో సీత , ఊర్మిళ పాత్రలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. జనకమహారాజు పెట్టిన సీతా స్వయంవరంలో శ్రీరామచంద్రుడు విల్లు విరిచి సీత దేవిని వివాహం చేసుకుంటాడు. ఈ క్రమంలో జనక మహారాజు మరొక కుమార్తె ఊర్మిళ దేవికి, లక్ష్మణుడికి కూడా వివాహం జరుగుతుంది.

దశరథ మహారాజు ఆదేశం మేరకు శ్రీరామచంద్రుడు వనవాసం బయలుదేరుతుంటే సీతాదేవి కూడా తన భర్తతో పాటు బయలుదేరుతుంది. దీంతో లక్ష్మణుడు కూడా అన్నా, వదినలకు రక్షణగా ఉండటానికి వారితో కలిసి అడవులకు వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఆ సమయంలో ఊర్మిళాదేవి కూడా వారితో పాటు వనవాసం వస్తానని అడగగా.. లక్ష్మణుడు అందుకు నిరాకరించి తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు.లక్ష్మణుడు అన్న , వదిన ల రక్షణకై వనవాసం బయలుదేరిన తర్వాత ఊర్మిళాదేవి 14 సంవత్సరాలపాటు నిద్రలో ఉంటుంది. ఊర్మిళాదేవి ఇలా 14 సంవత్సరాల పాటు నిద్రపోవటం వెనుక ఒక బలమైన కారణం ఉంది.

వనవాసానికి వెళ్ళిన సీతారాములకు రక్షణగా ఉండటానికి వెళ్లిన లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు తనకి నిద్రను దూరం చేయమని నిద్రాదేవత కోరుకుంటాడు. అయితే ప్రతి మనిషికి నిద్ర అనేది ప్రకృతి ధర్మం. నీకు బదులు నీ నిద్ర ఎవరికైనా పంచాలని నిద్ర దేవత లక్ష్మణుడికి చెప్పింది. ఈ క్రమంలో లక్ష్మణుడు వనవాసం చేసే 14 సంవత్సరాల పాటు తన నిధులను ఊర్మిళాదేవి ప్రసాదించమని నిద్ర దేవతని కోరాడు. ఈ విధంగా సీతారాముల 14 సంవత్సరాల పాటు వనవాసం చేసే సమయంలో ఊర్మిళ దేవి అయోధ్యలో ఉండి 14 సంవత్సరాలపాటు నిద్రపోయింది. వనవాసానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చే సమయానికి ఊర్మిళాదేవి కూడా తన నిద్ర నుండి మేల్కొని ఉందని రామాయణంలో ఉంది.