Sleep: రోజు 7 గంటలకంటే తక్కువ నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి కంటిన్యూగా నిద్రపోవడం లేదు సరిగా భోజనం చేయడం లేదు. సంపాదన ఉద్యోగం అంటూ వాటి కోసమే సమయాలను ఎక్కువగా కేటాయిస్తూ నిద్రను అలాగే ఆహారాన్ని నెగ్లెట్ చేస్తున్నాను. ముఖ్యంగా మనిషికి నిద్ర అన్నది చాలా అవసరం. కంటి అంటే నిద్రపోకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతిరోజు అవసరమైనంత నిద్రపోయిన వారు ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి ఎప్పుడో 1 లేదా 2 గంటలకు పడుకుంటారు.

వారు కనీసం 7గంటల పాటు కూడా నిద్రపోరు. అయితే దాని ప్రభావం వారి శరీరం పైన పడుతుంది. ప్రతి రోజు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో రకరకాల సమస్యలు వస్తాయి. శారీరక, మానసిక సమస్యలతో వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో కూడా సమయం దొరకడం లేదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే అతనికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. తక్కువ సమయం నిద్రపోతే ఆరోగ్యానికి హాని ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. 7 గంటల సమయం కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తి వేగంగా బరువు పెరుగుతారు.

నిద్ర చక్రంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇవి మానసిక రుగ్మతలకు కూడా కారణం అవుతాయి. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల వారిలో ఒత్తిడి, టెన్షన్ పెరుగుతుంది. డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాగా రాత్రి సమయంలో నిద్ర పోయినప్పుడు మన శరీరంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు రిపేర్ చేయబడతాయి. సరిగ్గా నిద్రపోని వారిలో శరీరం రిపేర్ కాదు. ఫలితంగా అనారోగ్యం వస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పోవు శరీరంలో విషపదార్థాలు చేరడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతోపాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలసేపు కచ్చితంగా నిద్ర పోవాలి.