Eggs: కోడి గుడ్లు సరిగా ఉడకకుండ ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా?

Eggs: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలలో కోడిగుడ్డు ఒకటి. అయితే కోడిగుడ్డు తినేటప్పుడు ఈ విధమైన పొరపాట్లు చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ప్రస్తుతం అందరికి ఆహార పదార్థాలు చెడిపోకుండా రిఫ్రిజిరేటర్ లో భద్రపరచుకోవడం బాగా అలవాటైపోయింది. అలాగే కోడిగుడ్లను కూడా రిఫ్రిజిరేటర్ లో భద్రపరుచుకుని అవసరమైనప్పుడు వాటిని వండుకొని తింటున్నారు. కోడిగుడ్లను ఫ్రిజ్లో పెట్టి ఉడికించడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

కోడిగుడ్లను ఫ్రిజ్లో పెట్టి ఉడికించడం కలిగి నష్టాలను గురించి బ్రిటన్ కి చెందిన ప్రముఖ చెఫ్ జేమ్స్ మార్టిన్ ఇలా వివరించారు. ఒక బాతు గుడ్డు ఒక కోడి గుడ్డు తీసుకొని కోడిగుడ్డును మూడు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టి ఉడికించడం వల్ల కోడిగుడ్డు సరిగా అడగలేదు. బాతు గుడ్డు ఫ్రిజ్లో పెట్టకపోవడం వల్ల అది తొందరగా ఉడికి రుచి బావుంది. కానీ నీ కోడి గుడ్డు ఫ్రిజ్లో పెట్టడం వల్ల కోడిగుడ్డు రుచి కూడా మారింది. పైగా కోడిగుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఇతర ఆహార పదార్థాల యొక్క రుచి, వాసన పీల్చుకొని కోడి గుడ్డు ఉన్న రుచి వాసన కోల్పోతాయి.
ప్రతిరోజు కోడి గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం అని డాక్టర్లు సూచిస్తుంటారు కోడిగుడ్డులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కోడిగుడ్డు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. కోడిగుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి లోపంతో బాధపడేవారు ప్రతిరోజు కోడి గుడ్డు తినడం వల్ల వారి సమస్య దూరమవుతుంది. సాధ్యమైనంతవరకు కోడిగుడ్డు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్ లో ఉంచి వాటిని ఉడికించి తినటం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం .