Health Tips: వేసవికాలంలో ఎక్కువ చల్లటి నీరు తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!

Health Tips: వేసవి కాలం మొదలవడం వల్ల సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భరించలేక అందరూ ఉపశమనం పొందడానికి చల్లటి నీరు తాగడానికి ఇష్టపడుతుంటారు. ఫ్రిజ్ లో ఉంచిన చల్లని నీరు ఎక్కువగా తాగడం వల్ల అప్పటికప్పుడు వేడి మంచి ఉపశమనం లభించినా కూడా ఇలా ఎక్కువ మోతాదులో ప్రతిరోజు చల్లటి నీటిని తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది చల్లటి నీటితో తాగటానికి అలవాటుపడి కాలంతో సంబంధం లేకుండా శీతాకాలం వేసవి కాలం లో కూడా చల్లని నీరు తాగుతుంటారు.ఇలా చేయటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చల్లని నీరు తాగి నప్పుడు ఆ నీటి ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రత మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ప్రతిరోజు ఎక్కువ మోతాదులో చల్లని నీరు తాగటం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తి తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం, గ్యాస్టిక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా బాగా చల్లగా ఉన్న నీరు తాగటం వల్ల నీటి ప్రభావం వెన్నెముకలోని కొన్ని నరాలపై పడుతుంది. ఫలితంగా మెదడుకు సంబంధించిన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మరింత గట్టి పడేలా చేసి రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. చల్లని నీరు నరాలమీద అ ప్రభావం చూపటం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని గుండె, ఊపిరితిత్తులు, కాలేయం సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో మరీ ఎక్కువగా చల్లటి నీరు తాగటం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.