Autism: పిల్లలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా.. అయితే ఆ వ్యాధికి గురైనట్లే..?

Autism: తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం విషయంలో, చదువుల విషయంలో ప్రవర్తన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్లు సైతం సూచిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న తరువాత జరిగే పరిణామాలకు చాలా బాధపడాల్సి ఉంటుంది. పిల్లల ప్రవర్తన పై కూడా తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. లేదంటే ఆ పిల్లలు వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పిల్లలు ఆటిజం అనే వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సమాచారం మేరకు ఈ వ్యాధి కి చికిత్స లేదు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం ద్వారా అటువంటి లక్షణాలు తగ్గించవచ్చు.

ఇది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్ గా చెప్పవచ్చు. అయితే దీని లక్షణాలు కొందరు పిల్లల్లో ఒక రకంగా కొందరు పిల్లల్లో ఇంకొక రకంగా ఉంటాయి. ఇలాంటి వ్యాధి చాలావరకు జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. దీంతో పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం నడపడం చాలా కష్టం అవుతుంది. ఆక్సిజన్ అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి పిల్లలకు సోకడం వల్ల పిల్లల మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయదట. అయితే ఈ వ్యాధి లక్షణాలు పిల్లలకు వచ్చిన కొన్ని నెలల తర్వాత మాత్రమే కనిపిస్తాయి. వాటిలో భాగంగానే చిన్నపిల్లలు మీ మాటలకు ప్రతి స్పందించకపోవడం, ఏడాది దాటినా కూడా మాట్లాడలేక పోవడం, అలాగే స్పర్శకు కూడా స్పందించకపోవడం వంటివి ఆటిజం లక్షణాలుగా చెప్పవచ్చు.

ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించడం తో పాటుగా ఆ పిల్లలతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. అనుక్షణం వారిని గమనిస్తూ వారి లో వస్తున్న లక్షణాలను గమనిస్తూ ఉండాలి. పిల్లలు సాధారణంగా ప్రవహించకపోతే వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదించడం అలాంటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అయితే మామూలుగా నెలలు పూర్తికాకుండానే పిల్లలు పుడితే వారు ఆటిజం వ్యాదికి గురయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అని వైద్యులు చెబుతున్నారుకాబట్టి ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం వల్ల పిల్లలను సాధారణ జీవితం గడిపే ఎలా చేయవచ్చు. అయితే ఈ ఆటిజం లక్షణాలు కేవలం పిల్లల్లోనే కాకుండా పెద్ద వాళ్లకు కూడా గుర్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అలా పెద్దవారికి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలకి కలత చెందుతూ ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. మరి పెద్దలలో ఈ వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు కానీ వ్యాధి లక్షణాలను మాత్రం తగ్గించవచ్చు.