Pawan Kalyan: అరుదైన వ్యాధికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… వ్యాధి ముదిరితే పక్షవాతమే?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప్రస్తుతం అనారోగ్యానికి గురయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసినదే. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు ఈ విషయాన్ని జనసేన అధికారగా సోషల్ మీడియా కాస్త ద్వారా వెల్లడించారు దీంతో జనసేన నాయకులు అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈయన తొందరగా కోలుకోవాలి అంటూ ప్రార్థిస్తున్నారు.

జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కు కూడా పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవచ్చు అంటూ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడిన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు.

ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తుంది. దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి.. దేనివలన వస్తుంది.. ? దాని లక్షణాలు ఏంటి.. ? అని నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థోసైటిసిస్. మహిళల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది. రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి వస్తుంది. మెడ నుంచి వెన్నుముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి.

రోజువారి పని ఒత్తిడిలో కారణంగా ఈ డిస్కుల మధ్యలో ఉన్నటువంటి గుజ్జు పక్కకు కదలడం వల్ల తీవ్రమైనటువంటి వెన్ను నొప్పితో పాటు మెడ నొప్పి కూడా వస్తుందని తెలుస్తోంది అయితే ఈ నొప్పి కనుక తీవ్రమైతే పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు అందుకే వీలైనంతవరకు కాస్త పని ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి తీసుకోవడం అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా డాక్టర్ల సూచనల ప్రకారమే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నట్టు సమాచారం.